Recent Posts

కోర్టులో ఉద్యోగాలు లైఫ్ సెటిల్ అనుకుని డబ్బులిచ్చారు.. కట్ చేస్తే..

నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నప్పటికీ, అమాయక నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు నిరుద్యోగ మహిళలకు జాదూగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.నల్లగొండ పట్టణానికి చెందిన ఎండీ నసీర్‌ నల్లగొండ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులకు గుమస్తాగా పని చేస్తున్నారు. మరోవైపు పలు కేసులపై ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేసేవాడు. నల్లగొండకు చెందిన జ్యోతి రాణి జూనియర్‌ అడ్వకేట్‌గా పని …

Read More »

వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మహిళా నేత!

కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీకి నిరంతర షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, ఎమ్మెల్సీ, డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవులకు రాజీనామా చేసి జకియా ఖానుం వైసీపీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. తిరుమల దేవస్థానం VIP టిక్కెట్ల అమ్మకం ఆరోపణలు, కూటమి నేతలతో జకియా సమావేశాలు వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. నిత్యం ఎవరో ఒక నేత పార్టీకి వారి పదవికి రాజీనామా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరో …

Read More »

తెలంగాణ పాలిసెట్‌ ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మే 13న పాలిసెట్‌ 2025 పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 276 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,06,716 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్షకు హాజరైనట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు మంగళవారం పాలిసెట్‌ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక పాలీసెట్‌ ఫలితాలు ఈ …

Read More »