Recent Posts

సోషల్ మీడియా మాటున చాటుమాటు యవ్వారం.. సీన్ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.!

హైదరాబాద్ మహానగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా మార్చాలని ప్రభుత్వం ముందుకు సాగుతుంటే.. కేటుగాళ్లు మాత్రం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా నగరంలో మరో దందా బట్టబయలు అయ్యింది. పెద్ద ఎత్తున నిషేధిత ఈ-సిగరెట్లను, వేపింగ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన సాదిక్ అలాని, అనిల్ అలాని అనే ఇద్దరు అన్నదమ్ములు ‘SID’ పేరుతో ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, దాని ద్వారా …

Read More »

స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం.. ఎన్ని అడుగులంటే..

అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే మరో పని చేయాలని నిర్ణయించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ నాయకుడు, దిగ్గజ నటుడు స్వర్గియ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకంగా భారీ విగ్రహాన్ని నీరుకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనుంది. ఈ భారీ విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ  తరహాలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర …

Read More »

సౌదీ గగనతలంలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. 3 యుద్ధ విమానాల ఎస్కార్ట్‌తో అపూర్వ స్వాగతం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా చేరుకున్నారు. సౌదీలో ప్రధాని మోదీకి ఆపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని విమానానికి రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన F15 విమానం భద్రత కల్పించింది. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న సంబంధాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. సౌదీ అరేబియాను విశ్వసనీయ స్నేహితుడుగా, వ్యూహాత్మక మిత్రదేశంగా ఆయన అభివర్ణించారు. 2019లో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పడినప్పటి నుండి, ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన విస్తరణ …

Read More »