Recent Posts

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!

సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్ 19) విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు. కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల …

Read More »

ఇంటర్ ఫలితాలు విడుదల ఆ రోజే.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది. ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. …

Read More »

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన రాచకొండ సీపీ.. ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025లో ఉత్కంఠ మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రస్తుతం లీగ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపైనా ఓ క్లారిటీ వచ్చేసింది. 34 మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో నిలవగా, పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఈ క్రమంలో ఓ వార్తతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతోపాటు బీసీసీఐలో కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రంగా ఓ బిజినెస్ మెన్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. తాజాగా దీనిపై …

Read More »