Recent Posts

RK Roja: కేసులు పెట్టినా, అరెస్ట్‌లు చేసినా ఖచ్చితంగా పోస్టులు పెడతాం.. మాజీమంత్రి రోజా ట్వీట్

RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం.. సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అధికార టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి.. ప్రతిపక్ష వైసీపీకి మధ్య సోషల్ మీడియా పోస్ట్‌ల వ్యవహారంలో తీవ్ర మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతూ పోస్ట్‌లు పెట్టిన వారిపై కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతరులను ఇబ్బంది పెట్టేలా పోస్టులు చేస్తుంటే అరెస్ట్ చేయరా అంటూ తాజాగా ఏపీ హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు …

Read More »

వైసీపీ నుంచి వచ్చిన నేతకు చంద్రబాబు ప్రమోషన్.. ప్రభుత్వంలో కీలక పదవి

వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు (ఆరోగ్యశ్రీ ట్రస్టు) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌గా విశాఖపట్నంకు చెందిన నేత సీతంరాజు సుధాకర్‌ను నియమించారు.ఆయన రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులిచ్చారు. సీతంరాజు సుధాకర్ గతంలో వైఎస్సార్‌సీపీలో ఉన్నారు.. గతేడాది డిసెంబర్‌లో ఆయన టీడీపీలో చేరారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, కూటమి …

Read More »

విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు.. ఈసీ సంచలన ప్రకటన

MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు అయింది. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నిర్వహించేందుకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఎమ్మె్ల్సీ ఇందుకూరి రఘురాజు.. తన పదవిలో కొనసాగవచ్చని కోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. …

Read More »