Blog Layout

దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట

ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమానావిష్కరణకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, …

Read More »

హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం.. అడ్డుకుంటామని VHP ప్రకటన

హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం నెలకుంది.  మే 4 నుంచి 31వరకు తెలంగాణలో ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలు నిర్వహణకు ప్లాన్ చేశారు. హైదరాబాద్‌ వేదికగా గ్రాండ్‌ ఫినాలే, ప్రారంభ-ముగింపు వేడుకలు జరగనున్నాయి. మిగతా ఈవెంట్స్‌ కోసం రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.  తెలంగాణలో అందాల పోటీల నిర్వహణను విశ్వ హిందు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అడ్డుకుని తీరుతామని చెబుతోంది. గతంలో కూడా భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరిగాయ్‌. 1996, 2024లో ముంబై వేదికగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఇప్పుడు …

Read More »

ఏపీ తన వాటాకు మించి నీళ్లు వాడుకుంది – కృష్ణా రివర్‌బోర్డుకు తెలంగాణ లేఖ

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని తెలంగాణ కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఏపీ ఇప్పటికే తన వాటాకు మించి వాడుకుందని, ఈ పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరింది. నాగార్జునసాగర్‌ నుంచి, శ్రీశైలం నుంచి ఏపీ ఇప్పటికీ నీటిని తీసుకుంటోందని, ఆ రాష్ట్రానికి కేటాయించిన దానికంటే మించి వాడుకొన్నా మళ్లీ నీటి వినియోగ ప్రణాళిక ఇమ్మని రెండు రాష్ట్రాలను కోరడం ఏంటి ప్రశ్నిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఫిబ్రవరి 11 …

Read More »

శ్రీశైలంలో అన్యమతస్తుల దుకాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

శ్రీశైలం దేవస్థానం పరిసరాల్లో అన్యమతస్తులకు దుకాణాలు కేటాయించవద్దని 2015లో అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో 425 జారీ చేసింది. ఆ జీవోను సవాల్‌ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. జీవో 425పై 2020లో స్టే విధించింది. అయితే.. స్టే ఉన్నప్పుటికీ ఏపీ ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవడంతో శ్రీశైలం ఆలయ పరిధిలోని కొందరు దుకాణదారులు మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లారు. దాంతో.. సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని.. …

Read More »

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ

ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. రేఖ గుప్తాతో లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా హిందీలో ప్రమాణం చేశారు. అలాగే.. పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్, కపిల్ మిశ్రా, ఆశిష్ సూద్, పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు. రామ్‌లీలా మైదానంలో ఢిల్లీ సీఎం …

Read More »

ఇక ఏడాదికి 2 సార్లు 10, 12 తరగతుల పరీక్షలు.. ముహూర్తం ఫిక్స్‌!

విద్యార్ధులకు సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనుంది. అన్నీ కుదిరితే 2026 నుంచే ఈ విధానం కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి, సీబీఎస్‌ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్‌) ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఏర్పాటుచేయగా.. వచ్చే సోమవారం నుంచి దీనిపై …

Read More »

అడకత్తెరలో గేమ్ ఛేంజర్లు.. శుద్దపూసలెవరు..? కనిపించని నాలుగో సింహాలెవరు?

బహిరంగ హెచ్చరికలు.. దాంతోపాటే ఓదార్పులు. నిజానికి.. అధికారులు, రాజకీయ నేతల మధ్య కోల్డ్‌ వార్‌ ఇప్పుడు మొదలైంది కాదు. నాలుగంకెల జీతంరాళ్లకు పనిచేసే హోమ్‌గార్డ్‌, క్లర్క్‌ నుంచి రాష్ట్ర పాలన, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని చూపులువేలితో శాసించగల చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా.. అందరిదీ ఒకటే కథ. అంతులేని పని ఒత్తిడి.గివ్ రెస్పెక్ట్.. టేక్ రెస్పెక్ట్..! గౌరవ మర్యాదలు అనేవి అడుక్కుంటే వచ్చేవి కావు. ఆజమాయిషీ చేస్తే దొరికేవి కావు. ఇచ్చిపుచ్చుకుంటే వచ్చేవి. పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్.. వీళ్ల ప్రొఫెషనల్ రిలేషన్ కూడా అచ్చంగా …

Read More »

నిరుద్యోగ యువతకు లక్షకుపైగా PM ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు.. ఎవరు అర్హులంటే?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) 2025 కింద దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఐదేళ్లలో 10 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌లను అందించనుంది.  ఇందుకు సంబంధించి ఈ ఏడాదికి ఇప్పటికే పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనాయి. 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్‌షిప్‌ అవకాశాల కోసం యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ …

Read More »

నేడే ఇంటర్మీడియట్ హాల్‌ టికెట్లు విడుదల.. ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1535 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను కూడా విడుదల …

Read More »

హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ రూట్లో ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్‌.. ప్రత్యేక రాయితీలు

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్నటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌- విజయవాడ రూట్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు శుభవార్త తెలిపారు.. ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే వారికి ఈ గుడ్‌న్యూస్‌ అందించింది. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో ప్రత్యేక రాయితీల‌ను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. ల‌హారి- నాన్ ఏసీ స్లీప‌ర్ క‌మ్ సీట‌ర్, …

Read More »