Blog Layout

lottery king: ఒకప్పుడు కూలీ, ఇప్పుడు లాటరీ కింగ్‌.. ఏటా రూ.15వేల కోట్ల టర్నోవర్.. ఈడీ దర్యాప్తులో సంచలనం

Lottery king: లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌.. వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఎలక్షన్ బాండ్ల సమాచారం బయటికి వచ్చి సమయంలో లాటరీ కింగ్ శాంటియాగో మార్టినే పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. వివిధ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో ఈ లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌.. ఏకంగా 5 ఏళ్లలోనే రూ.1300 కోట్లు వివిధ రాజకీయ పార్టీలకు అందించాడు. ఇదంతా లాటరీ బిజినెస్‌తో సంపాదించిందే కావడం గమనార్హం. అయితే లాటరీ బిజినెస్‌లో మోసాలకు …

Read More »

 ఆంధ్రాలో తాజా వెదర్ రిపోర్ట్.. వచ్చే 3 రోజులు ఇలా

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.. అలాగే మరోవైపు చలి పులి చంపేస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు దట్టంగా అలుముకుంది. స్థానికంగా మినుములూరు, అరకులో 12 డిగ్రీలు.. పాడేరులో 14 డిగ్రీలు, చింతపల్లిలో 16.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తెలంగాణ ఎఎమ్మెల్యే, ఎంపీల తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. వారానికి 4 సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. వారానికి 2 బ్రేక్‌ దర్శనాలు.. మరో రెండు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అనుమితించనున్నారు. ఈ మేరకు టీటీడీకి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక …

Read More »

భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా..? వారి సంపద ఎంతో తెలుసా?

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) దేశంలోని ముఖ్యమంత్రులకు సంబంధించిన కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఒక్కో ముఖ్యమంత్రి సగటు సంపద రూ.52.59 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రూ. 931 కోట్ల ఆస్తులతో భారతదేశపు అత్యంత ధనిక ముఖ్యమంత్రి కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం రూ. 15 లక్షల ఆస్తులతో అతి తక్కువ సంపద కలిగిన ముఖ్యమంత్రిగా నిలిచారు.భారతదేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం సంపద రూ.1,630 కోట్లు. భారతదేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా …

Read More »

సముద్ర తీరంలో తాబేళ్ల మృత్యుఘోష.. ఒడ్డుకు కొట్టుకువచ్చిన అరుదైన జాతి తాబేళ్ల కళేబరాలు

సముద్ర తీరప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. మొన్న కోస్తా తీరంలో తాబేళ్ల మృత్యుఘోష వినిపిస్తే.. నిన్న ప్రకాశం జిల్లాలో తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్‌ రిడ్లీ తాబేళ్ల మరణాలకు అరికట్టేందుకు.. అరుదైన జీవాలను కాపాడేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.కోస్తాతీరం ఎక్కువగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఆలివ్‌ రిడ్లీ జాతికి చెందిన పెద్ద పెద్ద తాబేళ్లు పదుల సంఖ్యలు మృత్యువాడ పడ్డటం ఆందోళన కలిగిస్తోంది. ఒడ్డుకు కొట్టుకువచ్చిన తాబేళ్ల కళేబరాలను …

Read More »

6 నెలల్లోనే మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు.. పేద బతుకుల్లో పట్టరాని ఆనందం!

ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో కూటమి సర్కార్ ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు రూ.4 వేల పింఛన్ పెంచడమే కాకుండా తొలి పింఛన్ తాడేపల్లిలోని ఓ లబ్ధిదారునికి ఇచ్చేందుకు అతని ఇంటికి స్వయంగా వెళ్లారు. అయితే ఆ సమయంలో ఇళ్లు కట్టుకోవడానికి లోన్ మంజూరు చేయగమని సీఎం చంద్రబాబుని అడగ్గా.. ఆ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చారు..కానీ ఊహించని విధంగా కేవలం 6 నెలల్లోనే యేళ్ల తన కల …

Read More »

యూసుఫ్‌గూడ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మృతి

తెలంగాణ పోలీస్ శాఖకు ఏమైందో అర్ధంకాకున్నది. ఈ శాఖలో గత కొంత కాలంగా వరుస మరణాలు సంభవిస్తున్నాయి. అధిక మంది ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్నారు. తాజాగా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూసఫ్ గూడకు చెందిన బెటాలియన్ సిబ్బంది ఒకరు గుండెపోటుతో కుప్పకూలారు. వివరాల్లోకెళ్తే..గత కొంత కాలంగా తెలంగాణ పోలీస్ శాఖలో సిబ్బంది వరుస ఆత్మహత్యలతో మృతి చెందుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ఆదివారం ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఆత్మహత్య …

Read More »

వివాహాలు, వివాహేతర సంబంధాలు.. చివరకు విషాదంగా మారిన ఓ మహిళ కథ..

ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అయితే.. ఆమె ఇంటికి వచ్చిన యువకులు ఎవరు..? మల్లికను చంపింది వారేనా… అయితే ఎందుకు చంపారు..? అంతకు ముందు ఏం జరిగింది..? మల్లిక హత్య గురించి పోలీసులు ఏం చెబుతున్నారు.. ఇవన్నీ ప్రస్తుతం గుంటూరులో హాట్ టాపిక్ గా మారాయి..గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూర్ లోని భాస్కర్ నగర్.. మధ్యాహ్న సమయం కావడంతో కాలనీ అంతా నిర్మానుష్యంగా ఉంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి మల్లిక ఇంటిలోకి వెళ్లారు. …

Read More »

డిగ్రీ సైన్స్‌ కోర్సుల్లో క్రెడిట్లకు భారీగా కోత.. ప్రాక్టికల్స్‌ రద్దు! వచ్చే ఏడాది నుంచి అమలు

తెలంగాణ ఉన్నత విద్యామండలి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. డిగ్రీ సైన్స్ కోర్సుల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సైన్స్ కోర్సుల్లో క్రెడిట్ పాయింట్లను భారీగా తగ్గించనుంది. అలాగే ప్రాక్టికల్స్ కూడా రద్దు చేయనుంది. వీటి స్థానంలో ప్రాజెక్ట్ వర్క్ లను తీసుకురానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో సైన్స్‌ కోర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మండలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్‌ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండగా వీటిని …

Read More »

పైకి చూసి ఉత్తుత్తి చాక్లెట్లు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వం.. ఇలా అందరూ డ్రగ్స్‌తో దొరికారో తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినా.. కేటుగాళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. న్యూఇయర్ వేళ భారీ ఎత్తున అక్రమంగా గంజాయి తరలిస్తూ.. ఆ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి.థర్టీ ఫస్ట్‌ రోజు లైన్‌ క్రాస్‌ చేస్తే తాటతీస్తాం. డ్రగ్స్‌ వాడారో దబిడిదిబిడే. అక్రమ మద్యంతో దొరికారా అంతుచూస్తాం అంటూ నిన్ననే సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు పోలీసులు. అయినప్పటికీ కేటుగాళ్లు తగ్గేదేలే అంటున్నారు. తాజాగా చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న కంత్రిగాళ్ల ఆటకట్టించారు …

Read More »