Blog Layout

డైలీ 1.5 GB డేటా.. జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ ఏది చీప్.. దేంట్లో ఎంత రీఛార్జ్ చేయాలి?

Daily 1.5 GB Data Plans: తక్కువ ధరల్లోనే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్‌లు అని రీఛార్జ్ ప్లాన్స్ తీసుకొచ్చి దేశంలో కొన్నేళ్ల కిందట రిలయన్స్ జియో సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. జియో రాకతో.. జనం దీనికి అలవాటుపడ్డారు. దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్- ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటివి కుదేలయ్యాయి. వీటి సబ్‌స్క్రైబర్లు భారీగా తగ్గి మెజార్టీ సంఖ్యలో జియోకు మారిపోయారు. కొంతకాలం బాగానే నడిచినా.. తర్వాత్తర్వాత జియో బాటలోనే అన్నీ పయనించాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలాగే రీఛార్జ్ ప్లాన్లు కూడా. ముందుగా …

Read More »

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఊహించని ట్విస్ట్.. లొంగిపోయిన ప్రధాన నిందితుడు

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసు సోమవారం ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోయారు. మంగళగిరి కోర్టులో పానుగంటి చైతన్య లొంగిపోయారు. ప్రస్తుతం పానుగంటి చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2021 అక్టోబర్‌లో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై కొంతమంది దాడి చేశారు. రాళ్లు, కర్రలతో టీడీపీ కేంద్ర కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ కేసులో పానుగంటి చైతన్య ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ …

Read More »

వాహనదారులు ఎగిరి గంతేసే వార్త.. ఇక కార్లకు టోల్ ట్యాక్స్‌ ఉండదు

Toll Tax: మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వివిధ వర్గాలకు ఊరటనిచ్చేలా అనేక పథకాలు, నిర్ణయాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాహనదారులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ముంబై నగరంలోకి ప్రవేశించే.. లైట్ మోటార్ వాహనాలకు ఆ మార్గంలో ఉండే టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజులు వసూలు చేయమని …

Read More »

పలాస: యువకుడు ఒకసారి మిస్.. నిమిషాల్లో రెండోసారి చావు తప్పలేదు

శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే రైలు కిందకు దూకడానికి ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కాపాడారు.. మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఓ యువకుడు ఉదయం 7 గంటల సమయంలో.. సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా రైలులో నుంచి పలాస రైల్వేస్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి రైలు కదులుతున్న సమయంలో ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్‌ బోగీల మధ్యకు దూకడానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని పక్కకు లాగేశారు. ఆ ఘటనలో యువకుడి తలకు …

Read More »

ఏపీలో ఓ వ్యక్తి అతి తెలివి.. ఏకంగా 155 మద్యం షాపులకు దరఖాస్తు, ఒక్కడే ఎంత ఖర్చు చేశారో తెలుసా!

ఏపీలో మద్యం షాపుల లైసెన్సుల కోసం లాటరీ జరుగుతోంది. విశాఖపట్నంలో ఓ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అతి తెలివితో 155 మద్యం షాప్‌లకు గాను 155 షాపులకు దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు⁠ 23 షాపులకు లాటరీ పూర్తికాగా.. ఒక్క షాపు కూడా రాలేదు. ఆయన తనను అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క షాపైనా తనకు రాకపోదా అని ఎదురు చూస్తున్నారు. అంటే ఒక్కో షాపుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.3 కోట్ల 10 లక్షలతో …

Read More »

విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం.. ఒక్కరోజులోనే కళ్లు చెదిరే ఆదాయం, రికార్డ్ బ్రేక్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. అయితే శుక్రవారం కనకదుర్గమ్మ దేవస్థానానికి భారీగా ఆదాయం వచ్చింది.. ఏకంగా రూ.84,02,775 ఆదాయం సమకూరింది. ఆ రోజు 4,149 మంది భక్తులు రూ.500 టికెట్లు కొనుగోలు చేయగా రూ.20,74,500 ఆదాయం వచ్చింది. అలాగే 1,847 మంది రూ.300 టికెట్లు కొనుగోలు చేయగా రూ.5,54, 100.. రూ.100 టికెట్‌తో 4,686 మంది దర్శించుకోగా రూ.46, 86,000 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అలాగే 26,584 లడ్డూలను విక్రయించగా.. రూ.3,98,760, రూ.100 చొప్పున ఆరు లడ్డూలున్న ప్యాకింగ్‌ లను విక్రయించగా రూ.44,06,600 …

Read More »

జిగ్రా విషయంలో ఏం జరుగుతోంది.. నిర్మాత భార్యపై కరణ్ కౌంటర్లు

కరణ్ జోహర్ నిర్మించిన జిగ్రా మూవీతో అలియా భట్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జిగ్రా చిత్రం ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. ఓ వైపు శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలియా భట్ జిగ్రా మూవీ డిజాస్టర్‌గా నిలిచేట్టుంది. అలియా భట్ జిగ్రా మూవీ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ నార్త్ ఆడియెన్స్‌కి కూడా ఎక్కలేదు. తెలుగులో భారీగానే ప్రమోషన్స్ చేశారు. కానీ తెలుగులో జిగ్రాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అన్ని చోట్ల థియేటర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది. …

Read More »

HYD నగరంలో అతిపెద్ద అండర్‌పాస్.. ఆ ఏరియాలోనే, ట్రాఫిక్ సమస్యకు చెక్

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే నగరం రూపరేఖలు మారిపోయాయి. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు అందుబాటులోకి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని నిర్మిచంగా.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణానికి సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలోనే అతిపెద్ద అండర్‌పాస్‌ను నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో నిర్మిస్తున్నారు. పార్క్ చుట్టూ సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణాలు సాగేలా ప్రభుత్వం ఈ అండర్‌పాస్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ –45 వైపు నుంచి కేబీఆర్‌ పార్కు మెయిన్ గేటు వైపు దాదాపు …

Read More »

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు సెమీస్ ఛాన్స్.. అదొక్కటే ఛాన్స్

ఆట ఏదైనా.. భారత్-పాకిస్థాన్ జట్లు ఎప్పటికీ దాయాదులే. కానీ మీరెప్పుడైనా అనుకున్నారా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గెలవాలని భారత అభిమానులు కోరుకోవాల్సి వస్తుందని. కానీ వచ్చింది.. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో తన చివరి లీగ్ దశ మ్యాచులో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఇప్పటికీ సెమీ ఫైనల్ చేరేందుకు అవకాశం ఉంది. అదేలా అంటే.. ఈ గ్రూప్‌లో చివరి మ్యాచ్ …

Read More »

ముంబయి- న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

ముంబయి నుంచి న్యూయార్క్‌కు వెళ్తోన్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపుల రావడంతో దానిని న్యూఢిల్లీకి మళ్లించారు. సోమవారం ఉదయం ముంబయి నుంచి 239 మంది బయలుదేరిన ఎయిరిండియా విమానం.. న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపినట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టు ఎయిరిండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. విమానాన్ని ప్రత్యేకంగా ఓ రన్‌వేపై నిలిపి.. భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ‘‘ముంబయి నుంచి న్యూయార్క్‌లో జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయానికి అక్టోబరు 14న ఉదయం బయలుదేరిన …

Read More »