Blog Layout

ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారికి అలర్ట్.. ఈ రూల్స్ తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితికి సంబంధించి అధికారులు, పోలీసులు కీలక సూచనలు చేశారు. సింగిల్‌ విండో ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలకు అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. విగ్రహం ఎత్తు 5 అడుగులకు మించి ఉండకూడదని.. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలకూ అనుమతి ఉండదన్నారు. హుండీలు, విలువైన వస్తువులు ఉన్న చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని.. బలవంతంగా చందాలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అగ్ని …

Read More »

జీతం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే.. ఉద్యోగం నుంచి తీసేశారు..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ‘ప్రజావాణి’ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే సీఎం రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు మెుర పెట్టుకుంటున్నారు. ఇలాగే ఓ మహిళా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని కూడా తన జీతం విషయంపై ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే జీతం విషయం దేవుడెరుగు ఉద్యోగమే తీసేశారని సదరు మహిళ వాపోయింది …

Read More »

క్రెడిట్ కార్డు లిమిట్ అంటే ఏంటి? మీకు పరిమితి తక్కువ ఉందా.. అసలు దీనిని ఎలా పెంచుకోవాలి?

Credit Cards: క్రెడిట్ కార్డుల్ని ఇప్పుడు చాలా మంది వినియోగిస్తున్నారు. నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఇవి కొనుగోళ్లు చేసే సౌలభ్యాన్ని అందిస్తాయి. క్రెడిట్ కార్డులపై మనకు కొంత లిమిట్ ఇస్తాయి బ్యాంకులు లేదా ఇతర క్రెడిట్ జారీ సంస్థలు. వస్తువులు లేదా ఇతర సేవల చెల్లింపుల కోసం ఆ పరిమితి మేరకు తక్షణ చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డులు కూడా కొన్ని ప్రయోజనాలు, నష్టాలతో వస్తాయి. క్రెడిట్ కార్డుల్ని బాధ్యతాయుతంగా ఉపయోగించడం వల్ల కలిగే బెనిఫిట్స్ సహా కార్డ్ లిమిట్ గురించి …

Read More »

ఓయో రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. జంటల ఏకాంత వీడియోలు రికార్డ్, ఎంతకు తెగించార్రా..!

తక్కువ ధరకే గదులు అద్దెకు లభిస్తుండటంతో చాలా మంది ఓయో రూమ్స్ వినియోగిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేవారు ఓయో రూముల్లో స్టే చేస్తూ తమ పనులు ముగించుకుంటున్నారు. ఇక యువత కూడా ఓయో రూములను ఎక్కవగా వినియోగిస్తుున్నారు. అయితే ఈ ఓయో రూమ్స్ తీసుకునే జంటలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు కేటుగాళ్లు ఓయో రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి జంటలు ఏకాంతంగా గడిపే వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఆపై డబ్బులు డిమాండ్ …

Read More »

వైసీపీకి బిగ్ షాక్, ఎంపీ రాజీనామా?.. టీడీపీలో చేరాలని నిర్ణయం!

వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మరో ముఖ్యమైన నేత ఆ పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గురువారం ఆ పార్టీని వీడబోతున్నట్లు కొందరు ట్వీట్‌లు చేశారు. మోపిదేవి చూపు తెలుగు దేశం పార్టీ వైపు ఉందని.. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు మోదలయ్యాయి. మోపిదేవి వెంకటరమణకు ఎంపీ పదవితో పాటుగా బాపట్ల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవి కూడా …

Read More »

కొత్త రేషన్ షాపుల ఏర్పాటు.. రివర్స్‌ టెండరింగ్‌, ఎస్‌ఈబీ రద్దు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేశారు.. మళ్లీ పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆబ్కారీ శాఖ పునర్‌ వ్యవస్థీకరణకు ఓకే చెప్పగా.. ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇచ్చే పట్టాదారు …

Read More »

శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు కలకలంరేపాయి. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము 3.42 నిమిషాలకు భూమి స్వల్పంగా కంపించినట్లు కొందరు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని.. అత్యల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. కొందరు భయంతో బయటకు పరుగులు తీశారు. నమాజ్ చేసేందుకు ఆ సమయంలో తాను లేచానని.. శబ్దాలు విని భయపడి బయటకు వచ్చానని ప్రత్యక్ష సాక్షి జోహార్ ఖాన్ అన్నారు. రెండేళ్ల క్రితం అక్టోబర్‌లో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చాయని.. వాటితో పోల్చితే నేడు వచ్చినవి …

Read More »

చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై నో సీక్రెట్, ఈ నెల 29 నుంచి ప్రజలకు అందుబాటులో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్‌ పోర్టల్‌ మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయిచింది.. ఈ మేరకు ఈ నెల 29 నుంచి ప్రభుత్వం జారీచేసే ప్రతి జీవోనూ జీవోఐఆర్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అంటే ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవో ప్రజలకు అందుబాటులో ఉంటుంది.. వారు స్వేచ్ఛగా జీవోలను చూడొచ్చు. జీవోఐఆర్ పోర్టల్‌కు సంబంధించి సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో సచివాలయంలోని ప్రతి సెక్షన్‌లోనూ జీవోలకు మాన్యువల్‌ రిజిస్టర్లు నిర్వహించేవారు. కచ్చితంగా వాటిలో నంబరు రాసి, జీవోలు విడుదల …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై అవి కూడా పంపిణీ, వచ్చే నెల పక్కా

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెల (సెప్టెంబరు) నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి సిద్ధమవుతోంది.. ఈ మేరకు పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కీలకమైన పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. రేషన్‌తో పాటుగా సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.. రెండు నెలలుగా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం చక్కెర పంపిణీ నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం …

Read More »

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ప్రతి నెలా రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో అర్చకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకుల వేతనాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. రూ.50వేలకుపైన ఆదాయం ఉన్న ఆలయాల్లో ప్రతి నెలా రూ.10 వేలు వేతనం పొందే అర్చకులకు ఇకపై రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 1,683 మంది లబ్ధిపొందనున్నారు. అమరావతి సచివాలయంలో దేవదాయ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు వేద విద్య చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వారికి నెలకు రూ.3 వేలు భృతి ఇవ్వాలని కూడా సూచించారు. …

Read More »