JanDhan: సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ యోజనకు శ్రీకారం చుట్టింది. 2014, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. బ్యాంకు సేవలు అందని వారికి, వెనకబడిన వర్గాలకు దీని ద్వారా బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని, లోన్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఈ ఖాతాలు తీసుకొచ్చింది. ఈ పథకం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతోంది. పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుత …
Read More »Blog Layout
ఏపీలో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు బంపరాఫర్..
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై విద్యుత్ సైకిళ్లను అందించే ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి సచివాలయంలో ఈఈఎస్ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సీఈఓ విశాల్ కపూర్, ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమై రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచడానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పిస్తామని.. పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన)లో భాగంగా …
Read More »కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 28, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ధనపరంగా ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సవ్యంగా సాగిపోతాయి. …
Read More »కోల్‌కతా హత్యాచార నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్.. అసలేంటీ పరీక్ష, అందులో నిజం ఎలా తెలుస్తుంది?
Kolkata Doctor Case: దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెను సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలో సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా మరో ఆరుగురికి పాలీగ్రాఫ్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో అతడ్ని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే జైలులోనే ఈ పాలీగ్రాఫ్ టెస్ట్‌ను సీబీఐ అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సంజయ్ రాయ్‌తోపాటు …
Read More »హైకోర్టులో నాగార్జునకు బిగ్ రిలీఫ్.. N కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని ఆదేశం
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో టాలీవుడ్ హీరో నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేయగా.. ఇది అక్రమం అంటూ యజమాని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నాగార్జున పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ టి వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం కూల్చివేతలపై స్టే విధించింది. కాగా, హీరో నాగార్జున మాదాపూర్‌లోని తూంకుంట ఒడ్డున 2015లో ఈ …
Read More »రేవంత్ సర్కార్‌కు సవాల్..హీరో నాగార్జున?
హైదరాబాద్ మాదాపూర్‌లో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు రావటంతో ఇవాళ ఉదయం అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్‌లో మెుత్తం 10 ఎకరాల్లో N కన్వెక్షన్ నిర్మాణం ఉంది. అయతే 29 ఎకరాల్లో ఉన్న తమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఈ కన్వెన్షన్ నిర్మించినట్లు ఫిర్యాదులు అందాయి. చెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ కబ్జా చేసి ఈ కన్వెన్షన్ నిర్మించటంతో హైడ్రా అధికారులు నేలమట్టం …
Read More »ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై నో టెన్షన్, జీతాలపై కూడా క్లారిటీ వచ్చేసింది!
ఏపీలో వాలంటీర్లకు శుభవార్త.. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ సంచాలకులు ఎం.శివప్రసాద్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయని తెలిపారు. ఆ బకాయిల్ని విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని.. వాలంటీర్లలో అత్యధికులు విద్యాధికులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు …
Read More »చంద్రయాన్-3 ప్రయోగానికి ఏడాది.. ఇస్రో కీలక నిర్ణయం
సరిగ్గా ఏడాది కిందట ఆగస్టు 23న సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చంద్రయాన్-3ను దింపి భారత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ దేశానికీ సాధ్యం కాని ఘనతను సాధించింది. రెండు వారాల పాటు చంద్రుడిపై పరిశోధనలు సాగించిన ల్యాండర్ విక్రమ్.. రోవర్ ప్రజ్ఞాన్‌లు కీలక సమాచారాన్ని సేకరించాయి. ఈ డేటాను విశ్లేషణ కోసం తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచింది. దక్షిణ ధ్రువంపై శివశక్తి పాయింట్ వద్ద ల్యాండర్ దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా …
Read More »మాచర్లలో పిన్నెల్లికి బిగ్ షాక్.. బెయిల్ వచ్చిందన్న ఆనందం కూడా మిగల్లేదుగా!
మాచర్ల రాజకీయం మరో మలుపు తిరిగింది.. ఊహించినట్లే మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగిరింది. శుక్రవారం మున్సిపాలిటీ నిర్వహించిన అత్యవసర సమావేశంలో 16 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తెలుగు దేశం పార్టీలో చేరారు. మొత్తం 31 మంది కౌన్సిలర్లలో 16 మందితోపాటు, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఓటుతో కలిపి 17కు బలం పెరిగింది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు కోరం 16 మంది ఉండటంతో.. టీడీపీ తరఫున ఛైర్మన్‌గా డిప్యూటీ ఛైర్మన్ పోలూరి నరసింహారావును ఎన్నుకున్నారు. దీంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలోకి చేరింది. గత వైఎస్సార్‌సీపీ …
Read More »హడలెత్తిస్తున్న ‘హైడ్రా’.. హీరో నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత
అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్‌గా మారిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్‌ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal