amaravatinews
August 6, 2024 ఆంధ్రప్రదేశ్
141
CM Chandrababu talks with Youtube CEO on Academy in AP:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ పెట్టారు. ఏపీలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో …
Read More »
amaravatinews
August 6, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
140
తిరుమల సిఫార్సు లేఖల విషయంలో గుంటూరు అరండల్‌పేటలో తనపై నమోదైన కేసు, వస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్సీ భరత్ స్పందించారు. తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లను అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని భరత్ అన్నారు.. తన తండ్రి ఓ ఐఏఎస్ అధికారి అని చెప్పిన భరత్ .. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని అన్నారు. ఉన్నతమైన విలువలతో తమ కుటుంబం బతుకుతోందని అన్నారు. టీడీపీ నేత చిట్టిబాబు చెప్తున్నట్లుగా తనకు మల్లికార్జున్ అనే పీఆర్వో లేడన్న ఎమ్మెల్సీ భరత్.. ఆ …
Read More »
amaravatinews
August 6, 2024 అంతర్జాతీయం, క్రైమ్
133
బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. ఇప్పటికే ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. దేశం విడిచి పారిపోయినా అక్కడ ఆందోళనలు మాత్రం చల్లారడం లేదు. దేశం మొత్తాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్నా.. నిరసనకారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య 440 కి పెరిగింది. తాజాగా ఓ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో.. అందులో ఉన్న 24 మంది సజీవ దహనం అయ్యారు. ఆ హోటల్‌లో ఇండోనేషియాకు చెందిన ఓ పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. …
Read More »
amaravatinews
August 6, 2024 Business, బిజినెస్
191
Smart TV Offers in Amazon Great Freedom Festival Sale 2024 : ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ నడుస్తోంది. రకరకాల బ్రాండ్ ప్రొడక్ట్‌లను.. మంచి డిస్కౌంట్ ప్రైజ్‌లతో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ అమ్మకాలు జోరందుకున్నాయి. భారత్‌లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లు ప్రజల ఆదరణ పొందాయి. అలాగే ఆయా వెబ్‌సైట్‌లు ఎప్పటికప్పుడు కొత్త తరహా ఆఫర్లతో మన ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో.. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ గ్రేట్ …
Read More »
amaravatinews
August 6, 2024 జాతీయం
155
PM Surya Ghar Yojana: నానాటికి పెరిగిపోతున్న విద్యుత్తు బిల్లులతో సామన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారేం చుపించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత కరెంటు పొందవచ్చు. జీవితాంతం ఉచిత విద్యుత్తు పొందడమే కాదు మిగులు విద్యుత్తును విక్రయించి ఆదాయమూ పొందవచ్చు. అదే ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన. దేశ వ్యాప్తంగా కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని …
Read More »
amaravatinews
August 6, 2024 ఆంధ్రప్రదేశ్
131
ఏపీలో నూతన మద్యం పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తాము అధికారంలోకి వస్తే నూతన మద్యం విధానం తెస్తామని.. నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి …
Read More »
amaravatinews
August 6, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
148
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి పలువురు నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే.. తాజాగా కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పార్టీకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అనుచరులకు పార్టీకి రాజీనామా చేయడంపై సంకేతాలు ఇచ్చేశారంట.. జనసేన పార్టీలోకి వెళ్లబోతున్నట్లు చెప్పేశారట.. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాకినాడ జిల్లాలో తాజాగా వైఎస్సార్‌సీపీకి షాక్ తగిలింది.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే …
Read More »
amaravatinews
August 6, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
150
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత భద్రతను తగ్గించారంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్.. పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ తరుఫున ఆయన న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్‌లో తనకు గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించాలని వైఎస్ జగన్ కోరారు. జూన్ 3వ తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునురద్ధరించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్ జగన్ పిటిషన్‌లో కోరారు. కేంద్ర ప్రభుత్వం …
Read More »
amaravatinews
August 6, 2024 ఆంధ్రప్రదేశ్
134
ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై క్లారిటీ వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ మీద ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థను టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. వాలంటీర్లకు టీడీపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ల భవిష్యత్తు విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన …
Read More »
amaravatinews
August 6, 2024 ఆంధ్రప్రదేశ్
129
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్లకు శుభవార్త చెప్పింది. మరుగుదొడ్ల ఫొటోలు తీసి, అప్‌లోడ్ చేసే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో బాత్రూమ్‌ల ఫొటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. అంతకముందు ఆ పనిని ప్రధానోపాధ్యాయులు చేయాలని చెప్పినా.. యాప్‌ల భారం పెరిగిందంటూ రోజుకో ఉపాధ్యాయుడు చొప్పున ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేసేవాళ్లు. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఐఎంఎంఎస్ యాప్‌లో బాత్రూమ్‌లో ఫొటోలు …
Read More »