Recent Posts

ఏపీలో వెయిటింగ్‌లోని ఐపీఎస్‌లకు మెమోలు.. ఆ కేసులు నీరుగార్చేలా, నిఘా విభాగం సంచలనాలు

ఏపీలో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌లకు మెమోలు జారీ వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇటీవల విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా కొందరు ఐపీఎస్‌లు కుట్ర చేసినట్లు రాష్ట్ర ఇంటిలిజెన్స్ (నిఘా) విభాగం గుర్తించిందట. వివిధ కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు సాగించినట్లు డీజీపీ కార్యాలయం గుర్తించారట. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో.. వెంటనే డీజీపీ కార్యాలయం అలర్ట్ అయ్యింది. వెయిటింగ్‌లో …

Read More »

కోల్‌కతాలో అర్ధరాత్రి అనూహ్య పరిణామం.. వైద్యురాలిపై అత్యాచారం జరిగిన ఆస్పత్రి ధ్వంసం

కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచారం ఘటనపై మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం అర్ధరాత్రి 11.55 గంటలకు ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్ర్యం’ పేరుతో ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ఆర్జీ కార్ హాస్పిటల్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులకు గాయాలయ్యాయి. డజన్లుకొద్దీ గుర్తుతెలియని వ్యక్తులు ఆస్పత్రిలోకి చొరబడే …

Read More »

తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్కరోజులోనే, సరికొత్త రికార్డు

తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత కాసుల వర్షం కురిసింది. కొన్ని నెలల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది.. చాన్నాళ్లకు స్వామివారి హుండీ ఆదాయం ఒక్క రోజులో రూ.5కోట్ల మార్కును దాటేసింది. బుధవారం తిరుమల శ్రీవారిని 72,967మంది భక్తులు దర్శించుకున్నారు.. 32,421మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి బుధవారం ఒక్కరోజే 5.26 కోట్లు ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ టికెట్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 …

Read More »