Recent Posts

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. వారందరికీ KTR వార్నింగ్‌! చట్టపరమైన చర్యలు తప్పవంటూ..

తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ నేతలపై అవాస్తవ ప్రచారం చేస్తున్న వారికి కేటీఆర్ హెచ్చరిక జారీ చేశారు. అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్‌ ఇచ్చారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తీవ్ర …

Read More »

భాగ్యనగరంలో ఈ సరస్సులు సూపర్.. కచ్చితంగా చూడాలి..

హైదరాబాద్ తెలంగాణ పరిపాలనా కేంద్రం. దీని చారిత్రక కట్టడాలు, ఐటీ సంస్థలకు ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ అందమైన సరస్సులు ప్రశాంతమైన సహజ ప్రకృతి దృశ్యాలు కలిగి ఉంటాయి. ఇవి పిక్నిక్, బోటింగ్ కోసం మంచి ఎంపిక. మరి భాగ్యనగరం చుట్టూ పక్కల ఉన్న 5 ఉత్తమ సరస్సులు ఏంటి.? ఈరోజు తెలుసుకుందామా.. హుస్సేన్ సాగర్ సరస్సు: 1563లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో హైదరాబాద్ ప్రసిద్ధ సరస్సులలో ఒకటైన హుస్సేన్ సాగర్‌ నిర్మించబడింది. ఈ సరస్సు 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి …

Read More »

బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌ను తరలించండి.. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత భయాందోళన..

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తర్వాత.. దేశంలోని ఎయిర్ పోర్టుల సమీపంలో నివాసం ఉండే ప్రజలు వణికిపోతున్నారు. సాధారణంగానే ఫ్లైట్స్ టేకాఫ్‌, ల్యాండింగ్ సమయంలో పెద్ద శబ్దం చేస్తుంటాయి. ఈ సమయంలో ఎయిర్ పోర్ట్ సమీపంలో నివాసం ఉండే వాళ్ల పరిస్థితి వర్ణనాతీతం. ఇక.. అహ్మదాబాద్‌ ప్రమాదం తర్వాత.. ఎయిర్‌పోర్టుల సమీపంలో ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే.. DGCAకి కంటోన్మెంట్ వికాస్ మంచ్ లేఖ రాసింది. బేగంపేట ఎయిర్ పోర్ట్ తరలించాలని డిమాండ్ చేసింది. బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌ను దుండిగల్‌కు తరలించాలని …

Read More »