Recent Posts

కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట.. కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్

సూపర్-6 హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉందని పోరుబాటకు సిద్ధమవ్వాలని వైసీపీ పార్టీ శ్రేణులకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.. ఏపీలో పాలనపై అందరూ అసంతృప్తితో ఉన్నారని.. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు సంధించారు.. బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో వైసీపీ చీఫ్ జగన్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో హామీలు అమలు …

Read More »

హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ.. దేశంలోనే తొలి సెంటర్‌గా..

తెలంగాణ ప్రభుత్వం మరో విజయం సాధించింది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్, హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC) స్థాపనకు అంగీకరించింది. ఇది భారత్‌లో తొలి సెంటర్‌గా, ఏషియా పసిఫిక్‌లో రెండవదిగా, ప్రపంచవ్యాప్తంగా ఐదవదిగా గుర్తింపు పొందనుంది. గూగుల్ LLC, తెలంగాణ ప్రభుత్వం మధ్య బుధవారం ఈ కీలక ఒప్పందం కుదిరింది. GSEC సెంటర్ హైదరాబాద్‌ను గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్‌గా తీర్చిదిద్దనుంది. గూగుల్ సెంటర్ సైబర్ భద్రత, ఆన్‌లైన్ సేఫ్టీ ఉత్పత్తుల రూపకల్పనపై ఫోకస్ చేయనుంది . అధునాతన పరిశోధనలతో పాటు …

Read More »

 చివరి నిమిషంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కమర్షియల్ రాకెట్ ప్రయోగం ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది.. బుధవారం పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) వెల్లడించింది. రాకెట్ ప్రయోగానికి ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా ఉపగ్రహంలో సమస్యను గుర్తించింది.. దీంతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. తిరిగి రేపు సా.4:12కు PSLV C-59 రాకెట్‌ ప్రయోగం జరగనుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ …

Read More »