Recent Posts

గన్స్‌తో యుద్ధాలు గెలవలేం..! ఆపరేషన్‌ సిందూర్‌ విజయంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్‌లోని వడోదరలో జరిగిన గతిశక్తి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రసంగించారు. ఆధునిక యుద్ధం లో లాజిస్టిక్స్‌ నిర్వహణ ఎంతో కీలకమని, తుపాకులు, బుల్లెట్ల కంటే లాజిస్టిక్స్‌ సామర్థ్యం యుద్ధ విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఆధునిక యుద్ధాలను “తుపాకులు, బుల్లెట్లతో గెలవలేం” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆదివారం వివిధ సంస్థల లాజిస్టిక్స్ నిర్వహణ ఆపరేషన్ సిందూర్ విజయానికి నిర్ణయాత్మక అంశం అని అన్నారు. గుజరాత్‌లోని వడోదరలో గతి శక్తి విశ్వవిద్యాలయ 3వ స్నాతకోత్సవంలో …

Read More »

కొలిక్కిరాని లోకల్‌ కోటా లొల్లి..! ఎంబీబీఎస్‌ రిజిస్ట్రేషన్ల గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 25వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. అయితే లోకల్ కోటా పంచాయితీ ఇంకా.. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల కోసం కన్వీనర్‌ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. …

Read More »

రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్‌… ముగ్గురు అరెస్ట్‌, ఇద్దరు పరారీ

పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ నగరంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. మరోసారి పోలీసుల తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. హైదరాబాద్‌లోని బాటసింగారంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్‌ చేశారు పోలీసులు. 934 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్‌ టీమ్‌. DCM వాహనంలో పండ్ల బాక్స్‌ల మధ్యలో గంజాయిని తరలిస్తూ దొరికిపోయారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు. పారిపోయిన …

Read More »