Recent Posts

ఏపీలోని 17 కార్పొరేషన్లలో.. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం – ఎప్పటినుంచి అంటే

సీఎం చంద్రబాబు సర్క్యులర్ ఎకానమీ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుభ్రత, పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా రెండు నెలల్లో వ్యర్థాల నిర్వహణపై తుది పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుచేయాలని నిర్ణయించారు.సర్క్యూలర్‌ ఎకానమీ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ఠ పరిచేలా రెండు నెలల్లో తుది పాలసీ రూపొందించాలని, వెంటనే అమలులోకి తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అమరావతి సచివాలయంలో …

Read More »

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ ఇదే.. 1:2 నిష్పత్తిలో ఎంపిక!

ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 పోస్టులకు తుది గట్టానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో ఇంటర్య్వూకి అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఈ ప్రకారంగా మొత్తం 182 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. వీరందరికీ జూన్‌ 23 నుంచి జులై 15వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత ఇంటర్వ్యూ తేదీలను కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది. ఏపీపీఎస్సీ …

Read More »

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ర్యాంకు కార్డులు వచ్చేశాయ్‌..

దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ర్యాంకు కార్డులు వచ్చేశాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలు విడుదల చేసింది. కాగా ఏప్రిల్‌ 29న NCET2025 పరీక్ష.. దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 స్థానిక భాషల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 54,470 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 44,927 మంది …

Read More »