Recent Posts

ఇంటిని కూల్చేసిన అధికారులు.. రూ.25 లక్షలు జరిమానా వేసిన సుప్రీంకోర్టు

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణల పేరుతో ఇళ్లు కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికిరాత్రే బుల్డోజర్లు పంపి అక్రమ నిర్మాణాల పేరుతో నివాసాలు కూల్చివేయజాలదని స్పష్టం చేసింది. కేవలం 3.7 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించారనే సాకుతో ఇంటిని కూల్చి వేసినందుకు బాధితుడికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని యోగి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు బాధ్యులైన అధికారులపై విచారణ చేపట్టాలని సూచించింది. ఈ క్రమంలో రహదారి విస్తరణ సమయంలో ఎలా …

Read More »

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. భారత్‌కు లాభాలేంటి? నష్టాలేంటి..?

India US Relations: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ప్రపంచ దేశాలు.. అమెరికా కొత్త అధ్యక్షుడి హయాంలో ఆ దేశంతో సంబంధాలు ఎలా ఉంటాయి అనేది లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ట్రంప్ 2.0 హయాంలో భారత్-అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఆసక్తికరంగా మారింది. వాణిజ్యం, దౌత్యపరమైన సంబంధాలు, వలసలు, సైనిక సహకారం వంటి అంశాల్లో భారత్-అమెరికా మధ్య …

Read More »

ఏపీలో వారికి అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షల నుంచి రూ.3లక్షలు, మంచి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో కార్పొరేషన్‌ ద్వారా అమలు చేసిన పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఈ పథకాల్లో తొలి పథకంగా.. జీవనోపాధి కల్పనకు రూ.50 వేల రాయితీతో రుణాల మంజూరుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్‌ని అనుసంధానించి సెర్ప్‌ ద్వారా అమలుకు శ్రీకారం చుట్టింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,732 మంది ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. …

Read More »