Recent Posts

రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు సబ్ కమిటీ ఆమోదం.. 5 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రతీవారమూ ప్రత్యేక కసరత్తు చేయాలని భావిస్తోంది.  ఈ మేరకు ప్రతి శనివారం ఇండస్ట్రియల్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. పరిశ్రమల ద్వారా వచ్చిన పెట్టుబడులు రాష్ట్ర యువతకు ఉపాధిని, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల …

Read More »

కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష తేదీ విడుదలైంది. మొత్తం 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2022లో నాటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వగా.. మొత్తం 5,03,487 మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 2023 జనవరి 22న వీరందరికీ ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా 91,507 మంది అర్హత సాధించారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించారు. ఇక ఇందులోనూ అర్హత సాధించిన వారికి తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను జూన్‌ 1న …

Read More »

మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లండ్ సంచలన ఆరోపణలు.. విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ వేదికగా 72వ ప్రతిష్ఠాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బ్రిటన్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగి ఈ నెల 16న తిరిగి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తొలుత తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన మిస్‌ ఇంగ్లాండ్. తమ దేశానికి వెళ్లిన తర్వాత మిస్‌ వరల్డ్‌ పోటీలపై సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో …

Read More »