Recent Posts

టెన్త్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్‌

రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది.. ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 11,819 బడుల నుంచి 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. …

Read More »

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ప్రదర్శనలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ని విశిష్టతలు ఉండబోతున్నాయని భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంకేతాలు ఇస్తోంది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేసి తమ సత్తా చాటుతామంటోంది కారు పార్టీ. ఇంతకీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి. వరంగల్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్న గులాబీ పార్టీ.. మూడు జిల్లాల సరిహద్దు అయిన ఎల్కతుర్తి దగ్గర రజతోత్సవ మహాసభ నిర్వహించేందుకు …

Read More »

సోషల్ మీడియా మాటున చాటుమాటు యవ్వారం.. సీన్ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.!

హైదరాబాద్ మహానగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా మార్చాలని ప్రభుత్వం ముందుకు సాగుతుంటే.. కేటుగాళ్లు మాత్రం కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తాజాగా నగరంలో మరో దందా బట్టబయలు అయ్యింది. పెద్ద ఎత్తున నిషేధిత ఈ-సిగరెట్లను, వేపింగ్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాంపల్లి ప్రాంతానికి చెందిన సాదిక్ అలాని, అనిల్ అలాని అనే ఇద్దరు అన్నదమ్ములు ‘SID’ పేరుతో ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, దాని ద్వారా …

Read More »