Recent Posts

మెగా డీఎస్సీ రాత పరీక్షలో నార్మలైజేషన్‌ అమలు.. దీనితో లాభమా? నష్టమా?

What is Normalization? రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ రావడంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. అయితే అంతలోనే మరో బాంబ్ విద్యాశాఖ పేల్చింది. అదేంటంటే.. డీఎస్సీ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇందులో నార్మలైజేషన్‌ అమలు చేయనున్నట్లు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు విద్యాశాఖ అధికారిక …

Read More »

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నిరుద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు విధానం కూడా ప్రారంభమైంది. సో నిరుద్యోగులు…కమాన్‌, గెట్‌రెడీ.. తెరవండి పుస్తకాలు.. చదివేయండి సిలబస్‌లు. ఎందుకంటే మెగా DSC వచ్చేసింది. 16వేలకు పైగా కొలువులను మోసుకొచ్చింది.కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నిరుద్యోగులకు ఎట్టకేలకు శుభ తరుణం వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువుల నియామకాలకు సంబంధించిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

అసభ్య పోస్టుల కేసు.. పూసపాటిరేగ పోలీసుల ముందు హాజరైన శ్రీరెడ్డి..!

సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పెట్టిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో శనివారం(ఏప్రిల్ 19) విచారణకు హాజరైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీ రెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు. కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల …

Read More »