Recent Posts

చోరీ కేసును విచారిస్తుండగా ఊహించని ట్విస్ట్.. ఇద్దరు యువకుల మధ్య చిగురించిన ప్రేమే..

తునిలో వృద్ధురాలిపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. విచారణలో ఈ చోరీ వెనక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. అమ్మాయిగా మారాలని ఆకాంక్షించిన సతీష్‌ (అవంతిక రెడ్డి) తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి ట్రాన్స్‌జెండర్‌ సర్జరీ కోసం డబ్బు సమకూర్చుకోవడానికే ఈ దోపిడీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన దొంగతనం కేసు వెనుక ఒక ఊహించని స్టోరీ బయటపడింది. ట్రాన్స్‌జెండర్‌గా మారాలన్న ఆరాటమే ఈ క్రైమ్‌కు కారణమని పోలీసులు తేల్చారు. ఆగస్టు 20న తుని …

Read More »

వరద బాధితులకు జియో, ఎయిర్‌టెల్‌ సాయం..! ఏ విధంగా అందిస్తున్నాయంటే..?

భారీ వర్షాలు, వరదలు అనేక కుటుంబాలను ప్రభావితం చేశాయి. వరద ప్రాంతంలో చిక్కుకున్న వారు కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రముఖ టెలికామ్‌ సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ ఈ ప్రాంతంలో చిక్కుకున్న వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. దేశంలోని వర్షం, వరద ప్రభావిత ప్రాంతాలలోని అన్ని ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో 3 రోజుల చెల్లుబాటు పొడిగింపును ప్రకటించింది. దీనితో పాటు వినియోగదారులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, మూడు రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్‌లను పొందుతారు. జియోహోమ్ వినియోగదారులకు, అంతరాయం …

Read More »

ట్రంప్‌ సుంకాలు విధించినా.. 2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌..!

భారత ఆర్థిక వ్యవస్థ 2038 నాటికి 34.2 ట్రిలియన్ డాలర్ల GDPతో ప్రపంచంలో రెండో స్థానానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం ప్రకారం 20.7 ట్రిలియన్ డాలర్లు చేరుకోవచ్చు. అధిక పొదుపు, పెట్టుబడులు, అనుకూల జనాభా వంటి అంశాలు దీనికి కారణం. 2038 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 34.2 ట్రిలియన్‌ డాలర్ల GDPతో ‍ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని, 2030 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం పరంగా 20.7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని …

Read More »