Recent Posts

దేశ సేవలో ఉన్న CRPF జవాన్‌ను హింసిస్తున్న రాజకీయ నేతలు! సెల్ఫీ వీడియోతో నారా లోకేష్‌కు వేడుకోలు..

మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రాందాస్ CRPF జవాన్‌గా దేశానికి సేవలందిస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అప్పులతో సతమతమవుతూనే రాందాస్ డ్యూటీకి తిరిగి వెళ్లిపోయాడు. రాందాస్ సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు. రాందాస్ తండ్రికి కూడా గుండె శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది. దీంతో మరోసారి తన భూమిని విక్రయించుకునేందుకు …

Read More »

మెగా డీఎస్సీ పరీక్షల కేంద్రాలు, తేదీలు మారాయ్‌.. కొత్త హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్‌ 6వ తేదీ నుంచి మొత్తం 154 పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్‌ 30వ తేదీ నాటికి ఈ పరీక్షలు పూర్తి కావల్సి ఉంది. అయితే జూన్‌ 20,21 తేదీల్లో నిర్వహించవల్సిన పరీక్షలను అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను జులై 1, 2వ తేదీల్లో నిర్వహిచనున్నట్లు విద్యాశాఖ అప్పట్లో …

Read More »

ఇవాళ్టి నుంచే రేషన్‌ సరుకుల పంపిణీ.. వారికి కూటమి సర్కార్ స్పెషల్‌ ఆఫర్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్న సర్కార్.. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం ఐదు రోజుల ముందే రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, దివ్యాంగులకు రేషన్‌ డోర్‌ డెలివరీ చేసే ప్రక్రియను 5 రోజుల ముందు నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జులై నెల రేషన్‌ను 5 రోజులు ముందుగానే జూన్‌ 26 నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో గురువారం …

Read More »