Recent Posts

ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి వనరుల వినియోగాన్ని సమర్థంగా మలచేందుకు మరో కీలక అడుగు వేసింది. బనకచర్ల ప్రాజెక్టును స్థాపించేందుకు పునాది వేస్తూ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాజాగా “జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్” అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అమరావతిని కేంద్రంగా చేసుకుని పనిచేయనున్న ఈ కంపెనీని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద నీటిని పట్టుకుని, రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు …

Read More »

హైదరాబాదీస్ బీ అటెన్షన్.. టోల్‌తో పన్లేదు.! ఇక ఓఆర్ఆర్‌పై గాల్లో దూసుకెళ్లడమే..

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారింది. ఆ పద్మవ్యూహం నుంచి బయటపడటానికి వాహనదారులు ఓఆర్ఆర్‌పై ప్రయాణం చేస్తుంటారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణం కొంతదూరం ఎక్కువగా ఉన్నప్పటికీ.. దానిపైనే ప్రయాణానికి మొగ్గు చూపిస్తుంటారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణం చేస్తున్న వాహనారులకు కూడా ఆలస్యం కాకుండా ఉండేందుకు.. ఇప్పుడు టోల్ ప్లాజాల వద్ద బూస్టర్ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్ట్ స్టాగ్‌ను సెకన్లలో రీడింగ్ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు. దాంతో ఈ లేన్‌లో వాహనాలు ఆగే పరిస్థితి ఉండదు. బారికేడ్లు తెరిచి ఉండగానే.. …

Read More »

కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి తెలియాలి.. ప్రత్యేక తీర్మానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తీర్మానాన్ని ఆమోదించారు. అంతకుముందు ఎమర్జెన్సీలో అణచివేతకు వ్యతిరేకంగా కేబినెట్‌ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. కొత్త తరానికి ఎమర్జెన్సీ గురించి వివరించాలని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అత్యవసర …

Read More »