Recent Posts

బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణలో తొలి గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసు నమోదు!

GBS Case: గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కలకలం రేపిన గులియన్‌ బారే సిండ్రోమ్‌ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ (Guillain Barre Syndrome) కేసు నమోదైంది. ఓ మహిళకు జీబీఎస్‌ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..దేశంలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా జీబీఎస్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. తెలంగాణలో తొలి జీబీఎస్‌ కేసు నమోదు అయింది. హైదరాబాద్‌లో గులియన్ బారే …

Read More »

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. ఎప్పట్నుంచంటే?

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2024 పరీక్ష తేదీలను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. పరీక్షకు మూడు రోజుల ముందు నుంచి అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తారు. సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రతీయేట ఈ పరీక్షను …

Read More »

ఏపీలో పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు.. మొరాయిస్తున్న సర్వర్లు..

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనం క్యూ కట్టారు. కొత్త థరలు అమల్లోకి రాకముందే భూముల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని భావించారు. రద్దీ పెరగడంతో చాలా చోట్ల సీఎఫ్‌ఎంఎస్‌ సర్వర్లు మొరాయిస్తున్నాయి.ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయల దగ్గర భారీగా రద్దీ ఏర్పడింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లపై భారం పడటంతో అవి మొరాయిస్తున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త …

Read More »