Recent Posts

ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్ధులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఎప్పుడిస్తారంటే?

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాలు, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్‌ గురుకులాల్లో ఇంటర్‌ చదివిన విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ పాఠశాలల్లో ఇంటర్‌ పాసై 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీల్లో సీటు సాధించిన వారికి ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అలాగే పది, ఇంటర్‌లో ప్రతి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురి చొప్పున విద్యార్ధులకు నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించింది. అలాగే క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్ధులకు కూడా బహుమతులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ …

Read More »

 హైదరాబాద్‌ శివారులో భయం భయం… ఒంటరిగా బయట తిరగొద్దని అధికారుల ప్రకటన

గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బాలాపూర్‌లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌లో రెండు చిరుతల సంచరించడం నిజమేనని అధికారులు తేల్చారు. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా బయట తిరగొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో చిరుతల సంచారం స్థానికంగా సంచలనంగా మారింది. గతంలోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా చిరుత పులులు సంచరించాయి. నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పుడు అటవి అధికారులు శ్రమించి నగర శివార్లలో తిరుగుతున్న పులులను పట్టుకున్నారు. అనంతరం …

Read More »

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కస్టడీ కోరనున్న సీఐడీ… ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనున్న సీఐడీ

హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును కస్టడీ కోరనుంది సీఐడీ. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జగన్‌తో పాటు మరికొంత మంది నిందితులను విచారించనుంది సీఐడీ. ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనుంది సీఐడీ. ఈ క్రమంలో హెచ్‌సీఏ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ నెక్స్ట్ యాక్షన్ ప్లానేంటి? అనే అంశం ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకలపై ఈడీ విచారణ మొదలుపెట్టింది. ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సీఐడీకి …

Read More »