Recent Posts

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఆస్తి పన్ను రద్దు

దేశ రక్షణలో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి చేసే సేవలు అపూర్వమైనవి. అలాంటి వీర సైనికులను గౌరవించడం ప్రతి పౌరుని, ప్రతి ప్రభుత్వానికీ బాధ్యత. సరిహద్దుల్లో దేశం కోసం యుద్ధం చేసే వారిని మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా సాయం చేయడం ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైనిక కుటుంబాలకు మరింత ఆదరణ చూపుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో భారత రక్షణ దళాలకు …

Read More »

పహల్గామ్‌లో పురుషులే లక్ష్యంగా ఉగ్రదాడి.. ముగ్గురు తెలుగు వారితో సహా మొత్తం ఎంత మంది మరణించారంటే..

ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ మంగళవారం జరిగిన ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉల్కిపడింది. ప్రకృతి అందాల నడుమ సంతోషంగా కొన్ని రోజులు గడిపేందుకు వెళ్ళిన పర్యాటకుల జీవితంలో మరచి పోని రోజుగా మిగిలింది. పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సుమారు 30 మంది మరణించినట్లు.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిని కేవలం పురుషులను మాత్రమే టార్గెట్ గా చేసుకున్నారు. స్థానిక యువకుడితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళిన పర్యాటకులు మరణించారు. మరణించిన వారిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందినవారున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాల్లోకి వెళ్తే..జమ్మూ …

Read More »

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌ హస్తం.. టూరిస్టులపై కాల్పులు జరిపిన ముష్కరుడి ఫొటో విడుదల..

పహల్గామ్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాది మొదటి చిత్రాన్ని పోలీసులు పంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం పర్యాటకులపై దాడి చేసిన వారిలో ఈ ఉగ్రవాది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకరు.. అతను ఆయుధాలు పట్టుకుని పఠానీ సూట్ ధరించి కనిపించాడు.ఉగ్రదాడితో.. జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, వాయుసేన బలగాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. పహల్‌గామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది.. ఆర్మీ, డ్రోన్ల సాయంతో భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. …

Read More »