Recent Posts

మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్యపై స్పందించిన సత్య నాదెళ్ల: ఏమన్నారంటే?

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows)లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టంలు షట్‌డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో క్రౌడ్ స్ట్రైక్ అప్‌డేట్ చేయడం వల్లే సాంకేతిక సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ విషయంపై తాజాగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) స్పందించారు. నిన్న క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్‌డేట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్లలో సాంకేతిక …

Read More »

సింహాచలంలో నేడు గిరి ప్రదక్షిణ మహోత్సవం

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీనృసింహ స్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో శనివారం గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం కానుంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. పౌర్ణమి సందర్భంగా ఆదివారం వేకువజామున సింహాద్రినాథుడికి తుది విడత చందన సమర్పణ చేస్తారు.

Read More »

మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు

ఆభరణాల వ్యాపారుల నుండి బలహీనమైన డిమాండ్ కారణంగా, జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ.300 నుంచి రూ.500 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ మార్కెట్ కామెక్స్‌లో శనివారం వరుసగా నాలుగో సెషన్‌లో బంగారం తక్కువగా ట్రేడవుతోంది. అయితే జూలై 20వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర …

Read More »