Recent Posts

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

నాటకీయ పరిణామాల మధ్య ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్‌ కీలను పరీక్ష జరిగిన రోజునే కమిషన్‌ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీతోపాటు అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది..రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) తెలిపింది. ఆదివారం నిర్వహించిన గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. …

Read More »

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంతా సిద్దం.. వైఎస్ జగన్ హాజరు.. మరోసారి ప్రతిపక్ష హోదా తెరపైకి.!

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమరం ప్రారంభం కాబోతోంది. అయితే, సమావేశాలకు హాజరవుతున్నామని వైసీపీ ప్రకటించడంతో వాతావరణం ఆసక్తికరంగా మారింది. జగన్‌తో సహా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాను డిమాండ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులపాటు సమావేశాలు నిర్వహించాలి, …

Read More »

కడప జైల్ మెడికల్ క్యాంపు వెనకాల… ఏం జరిగిందో తెలిస్తే..

రాజమండ్రి సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ శ్రీరామ్‌ను విచారణ అధికారిగా నియమించారు. విచారణలో భాగంగా, డాక్టర్‌ చైతన్యరెడ్డి, అప్పటి కడప సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఐఎన్‌ఎస్‌ ప్రకాష్‌, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై కేసులు నమోదు చేశారు. విచారణలో, డాక్టర్‌ చైతన్యరెడ్డి జైలులో దస్తగిరి బ్యారక్‌లోకి ప్రవేశించి, ఆయనను బెదిరించారనే ఆరోపణలపై దృష్టి పెట్టారు.వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి, కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సమయంలో బెదిరింపులకు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం …

Read More »