Recent Posts

ఆలయ శ్రావణమాస వేడుకలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి

బిహార్‌లోని ఓ ప్రముఖ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుని.. ఏడుగురు భక్తులు మృతిచెందారు. ఆదివారం అర్ధరాత్రి జెహానాబాద్‌ పట్టణం మఖ్దుంపూర్‌‌లోని బర్వావర్‌ కొండపై ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడినవారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయక …

Read More »

విజయవాడ దుర్గమ్మ భక్తులకు అదిరే ఆఫర్.. ఉచితంగానే, వెంటనే దరఖాస్తు చేస్కోండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఈనెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించబోతున్నట్లు ఆలయ ఈవో రామరావు తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆర్జిత సేవ టికెట్‌ రూ.1500తో కొన్న వారికి వ్రతం నిర్వహిస్తారన్నారు. ఉదయం 10 నుంచి 11.30 వరకు తెల్ల రేషను కార్డు కలిగి ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత వరలక్ష్మీ వ్రతాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తుమన్నారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్‌కు 500 మందికి మాత్రమే అనుమతి …

Read More »

స్వింగ్‌ స్టేట్స్‌లో కమలా హ్యారిస్ దూకుడు.. పోల్ సర్వేల్లో ట్రంప్‌పై ఆధిక్యం

గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధిత్వం నుంచి అనూహ్యంగా జో బైడెన్ తప్పుకోవడం.. ఆయన స్థానంలో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పోటీకి వచ్చారు. ఆగస్టు 19న జరిగే డెమొక్రాటిక్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కమలా పేరును లాంఛనంగా ప్రకటించున్నారు. ఎన్నికలకు మరో మూడు నెలలే సమయం ఉండగా.. డెమొక్రాట్లకు అన్నీ శుభశకునాలే ఎదురవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్‌ సర్వేల్లో రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్‌ …

Read More »