Recent Posts

TSRTC: రాఖీ పండుగ వేళ ఆడపడుచులకు మరో బంపర్ ఆఫర్.. వారం ముందు నుంచే..!

తెలంగాణలోని మహిళామణులందరికీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా.. ఆడపడచులకు ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. ఆడపడుచుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. రక్షా బంధన్ సందర్భంగా.. ఆడపడుచులు తమ అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ఆనవాయితీ. అయితే కొందరు పుట్టింటికి, అన్నదమ్ములకు చాలా దూరంలో ఉండటమో.. అనివార్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోవటమో జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో.. ఆ అక్కాచెల్లెల్లు.. పోస్ట్ లేదా …

Read More »

తిరువూరు: ఏటీఎంలో రూ.5వేలు నొక్కితే రూ.7వేలు వచ్చాయి.. పండగ చేసుకున్నారుగా

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విచిత్రమైన ఘటన జరిగింది. పట్టణంలోని ఓ ఏటీఎంలో నుంచి నోట్ల వర్షం కురిసింది. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.5వేలు డ్రా చేస్తే రూ.7వేలు వచ్చాయి. ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికి తెలియడంతో.. కొందరు కస్టమర్లు ఏటీఎంకు వచ్చి డబ్బులు డ్రా చేసుకుని వెళ్లారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బ్యాంకు అధికారులతో కలిసి ఏటీఎంను మూసివేయించారు. సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత …

Read More »

మాధురిని పరిచయం చేసింది నా భార్యే.. ఏం తప్పుచేశానని నాకీ శిక్ష?.. దువ్వాడ

కుటుంబ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. విలేకర్ల సమావేశం నిర్వహించిన దువ్వాడ శ్రీనివాస్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య వాణి అహంకారంతో వ్యవహరిస్తూ.. తనపై కూతుర్లకు ద్వేషం నూరిపోశారని ఆరోపించారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సహజమేనన్న దువ్వాడ శ్రీను.. వాటిని నాలుగు గోడల మధ్యనే పరిష్కరించుకోవాలన్నారు. వ్యాపారంతో పాటుగా రాజకీయాల్లో కూడా తానే ఉండాలని వాణి అహంకారంతో వ్యవహరించిందని.. కుమార్తెలకు తనపై ద్వేషం నింపిందన్నారు. వైఎస్ జగన్ తనకు టెక్కలి టికెట్ ప్రకటిస్తే.. తనకు కావాలని వాణి పట్టుబట్టిందన్నారు. విడాకులు …

Read More »