Recent Posts

ఏపీలో ప్రజలకు భారీ ఊరట?.. విద్యుత్ ఛార్జీలపై కీలక అప్డేట్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రిలీఫ్ దక్కేలా ఉంది. రాష్ట్ర విద్యుత్‌ వినియోగదారులపై ఛార్జీల మోత లేకుండా.. 2025-26కి డిస్కంలు వార్షికాదాయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందజేశాయి. ఈ నివేదికలో విద్యుత్‌ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు.. ఈ నిర్ణయంతో ప్రజలకు ఊరట లభించనుంది. నివేదికలో విద్యుత్‌ కొనుగోళ్లు.. విక్రయాలకు మధ్య వ్యత్యాసం రూ. 14,683.24 కోట్లుగా పేర్కొన్నారు. కొనుగోళ్లు, నిర్వహణకు రూ. 58,868.52 కోట్లు అవసరమని.. విద్యుత్‌ విక్రయాల ద్వారా రూ. 44,185.28 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశాయి …

Read More »

ఏపీ మద్యం షాపుల దగ్గర బ్యానర్లు ఏర్పాటు.. రూ.5 లక్షల ఎఫెక్ట్, ఆసక్తికర కారణం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అక్టోబర్ నెల నుంచి అమల్లోకి వచ్చింది. లాటరీ ద్వారా కేటాయించిన షాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మద్యం ధరల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో ప్రస్తుతం ప్రతి వైన్ షాప్ వద్ద ధరల పట్టికలు కనిపిస్తున్నాయి. అలాగే.. MRP ధరలకే మద్యం అమ్మబడును.. అని కూడా బ్యానర్లు కడుతున్నారు. మద్యం బ్రాండ్, ఎంత ఎంఎల్ ఎంత ధరకు లభిస్తుంది వంటి వివరాలతో బ్యానర్లు పెడుతున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి వైన్ షాప్ …

Read More »

టీజీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరణ.. తొలిరోజే మాస్‌ వార్నింగ్‌!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కొత్త ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇకపై పరీక్షల వాయిదాలు ఉండవని, అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తొలగించుకోండంటూ.. బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్ తన కల అన్నారు. …

Read More »