Recent Posts

Paris Olympics 2024: పారిస్ సంబరం.. ఘనంగా ఆరంభం..

పారిస్ 2024 ఒలింపిక్స్‌కు అధికారికంగా తెరలేచింది. ఒలింపిక్ చరిత్రలో తొలిసారి నదిలో జరిగిన ఈ సంబురాలు.. చూపరులను ఆకట్టుకున్నాయి. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పారిస్‌ ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు అంబరాన్ని తాకాయి. చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో నిర్వహించింది. గతంలో ఎప్పుడైనా ప్రారంభ వేడుకలు స్టేడియంలో జరిగేవి.. కానీ పాత పద్దతికి స్వస్తి పలుకుతూ సెన్ నదిపై వేడుకలను ఘనంగా నిర్వహించింది ఫ్రాన్స్. విశ్వక్రీడల …

Read More »

 ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. 

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజులు ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా.. ఈసారి కూడా వారే ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా తెలియజేశారు. అస్వస్థతతో ఉన్న వారు, ఇంకా పంపిణీ మిగిలితే 2న ఇస్తారు. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు …

Read More »

మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధర.. వారంలో రూ.5000 డౌన్.. 

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. బడ్జెట్ తర్వాతి రోజు నుంచే బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5 వేలకుపైగా దిగిరావడం గమనార్హం. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ తర్వాతి రోజు నుంచి సైతం …

Read More »