Recent Posts

ఏపీని వణికిస్తున్న వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌‌ను వర్షాలు వణికిస్తున్నాయి.. అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా వానలు ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.. ఇప్పటికే మరో అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండు మూడు రోజుల్లో రెండో అల్పపీడనం మరింత బలపడి వాయవ్య దిశగా ఒడిశా తీరంవైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు విస్తాయంటున్నారు. ఇవాళ …

Read More »

ఏపీలో రైల్వే ప్రయాణికులకు గమనిక..

ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు స్టాపేజీలు కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో 40 రైళ్లు కొత్తగా మరో 30 స్టేషన్లలో ఆగనున్నాయి. రైల్వే అధికారులు దీనిని ప్రయోగాత్మకంగానే అమలు చేస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొంతకాలం తర్వాత పునరాలోచన చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దశలవారీగా ఆయా రైళ్లలో కొత్త హాల్ట్‌లు ప్రారంభమవుతాయి. ప్రకాశం జిల్లా చినగంజాం రైల్వే స్టేషన్‌లో.. …

Read More »

తిరుమలలో 300 ఏళ్లుగా కొనసాగుతున్న వేడుక.. ఈ సారి జులై 24న..

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో పల్లవోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 24వ తేదీన తిరుమలలో పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహించనుంది .మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం జులై 24న పల్లవోత్సవం నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవోత్సవం సందర్భంగా సహస్రదీపాలంకార సేవ తర్వాత.. శ్రీవారు కర్ణాటక సత్రానికి చేరుకుంటారు. శ్రీదేవీ, భూదేవీసమేతుడైన శ్రీనివాసుడు కర్ణాటక సత్రానికి చేరుకున్న తర్వాత.. కర్ణాటక ప్రభుత్వం తరుఫున వచ్చిన ప్రతినిధులు.. మైసూరు సంస్థానం ప్రతినిధులు.. స్వామివారికి హారతి సమర్పిస్తారు. అనంతరం …

Read More »