Recent Posts

తిరుమలలో విషాదం.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు మృతి

తిరుమలలో విషాదం జరిగిది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో శ్రీవారి దర్శనానికి నడిచి వెళుతుండగా.. గుండెపోటుతో చనిపోయాడు. నవీన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.. ఆయనకు 15 రోజుల క్రితం వివాహమైంది. నవీన్ శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు బయలుదేరారు. నడుకుకుంటూ 2,350వ మెట్టు దగ్గరకు రాగానే.. నవీన్‌ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి …

Read More »

ఏపీలోని మహిళలకు శుభవార్త.. ఉచిత గ్యాస్ పంపిణీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఎన్నో రోజులుగానో ఎదురుచూస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామసభ కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామని ప్రకటించారు. అలాగే ఇల్లు లేని …

Read More »

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఈ నెలాఖరు వరకు ఛాన్స్, ఉత్తర్వులు వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ బదిలీలను పాత జిల్లా (ఉమ్మడి) స్థాయిలోనే నిర్వహించనుండగా.. బదిలీలకు అర్హత ఉన్న ఉద్యోగులు ఈ నెల 27లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ బదిలీలను నిర్వహించే విభాగాలు 28న దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుంటాయి.. ఈ నెల 29 నుంచి 30 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, బదిలీ ఆదేశాలు ఇస్తారు. కౌన్సెలింగ్‌ సమయంలో …

Read More »