Recent Posts

కస్తూరి శంకర్ అరెస్ట్..హైదరాబాద్‌లో పోలీసులకు దొరికిపోయిన నటి

తెలుగు మ‌హిళ‌ల‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న‌టి క‌స్తూరి శంకర్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. న‌వంబ‌ర్ 3వ తేదీ నుంచి ప‌రారీలో ఉన్న కస్తూరిని.. హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అనంత‌రం ఆమెను ప్రత్యేక వాహ‌నాల్లో చెన్నైకి త‌ర‌లిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఓ బ్రాహ్మణ సమాజం సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఒక్కసారిగా దుమారం రేపింది. 300 ఏళ్ల కిందట …

Read More »

AP New Airports: ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు.. నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త. ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో 6 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.92 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి ఫీజబులిటీ స్టడీ కోసం నిధులు విడుదల చేస్తామని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి …

Read More »

Chandrababu Brother: చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదం.. సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూ్ర్తి నాయుడు (72) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు.. నవంబర్ 14వ తేదీ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. నారా రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు …

Read More »