Recent Posts

జగన్.. నీకా అర్హత లేదు.. కేసీఆర్‌తో కుమ్మక్కై నాశనం చేశావ్: గొట్టిపాటి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం గురించి ప్రశ్నించిన వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైఎస్ జగన్‌కు లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది వైఎస్ జగన్‌నేనని ఆరోపించారు. ప్రకాశం జిల్లా నేతలమంతా కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిశామన్న గొట్టిపాటి రవికుమార్.. వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేశారన్నారు. అప్పటి …

Read More »

కోల్‌కతా హత్యాచార ఘటన.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులతో పాటు ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ తీరుపై తీవ్రంగా మండిపడింది. అంత ఘోరం జరిగితే.. ఆమె ఆత్మహత్య చేసుకుందనిని ఎలా చెప్పారని మాజీ ప్రిన్సిపాల్‌ను నిలదీసింది. ఆయనను ఆ కాలేజీ నుంచి తొలగించి.. మరోచోట ప్రిన్సిపల్‌గా నియమించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కొన్ని …

Read More »

విజృంభిస్తోన్న మంకీపాక్స్.. ఎయిర్‌పోర్ట్‌లు, సరిహద్దుల్లో అలర్ట్ ప్రకటించిన కేంద్రం

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Mpox) వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ మిగతా ఖండాల్లోని దేశాలకు పాకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించి.. సమీక్షచేపట్టారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేశారు. తాజాగా, మంకీపాక్స్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు చేసింది. వీటితో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని పోర్టుల దగ్గర కూడా నిఘా పెంచాలని …

Read More »