Recent Posts

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎందుకంటే..

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి సీఎం.. ఇవాళ మరికొందరిని భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేయనున్నారు. అటు ఏఐసీసీ పెద్దలతో సీఎం సమావేశం తర్వాత.. మంత్రి వర్గ విస్తరణపై కీలక అప్‌డేట్ రానుంది.ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీబిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలుప్రాజెక్టుల కోసం నిధుల మంజూరు చేయాలంటూ …

Read More »

చూడటానికి తియ్యటి చాక్లెట్స్‌లా ఉన్నాయి.. ఓపెన్ చేసి చూస్తే గుండె ధడేల్..!

చూడటానికి తియ్యటి చాక్లెట్స్ లాగే ఉంటాయి.. రంగుల కాగితం చుట్టి, చూస్తే తినాలి అనిపించేంత అందంగా ఉంటాయి. కానీ, అవి బయట షాపుల్లో దొరికే చిన్న పిల్లలు తినే చాక్లెట్లు అనుకుంటే మీరు పొరబడినట్లే.. అచ్చంగా గంజాయి చాక్లెట్లు.. ఏకంగా 4 కేజీల, 957 గ్రాముల గాంజా చాక్లెట్స్ సీజ్ చేసి, అవి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రైడ్స్ చేపట్టింది. ఇందులో భాగంగా గాంజా చాక్లెట్స్ విక్రయిస్తున్న వీరేంద్ర పాండే …

Read More »

ఇదెక్కడి దరిద్రంరా నాయనా.. బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లి..

హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతంలోని భరత్‌ నగర్‌లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. అయితే, చెప్పులు, షూలు మాయమవ్వడం సాధారణ దొంగతనంగా భావించిన స్థానికులు.. కొంతకాలానికి దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్నారు. చెప్పులు, షూలు, స్లిప్పర్లను చోరీ చేస్తూ.. అవి విక్రయించడానికి ఓ దంపతులు వినూత్న పద్ధతిని ఉపయోగించారు. వారి ఇంటిని చెప్పుల గోడౌన్‌గా మార్చి, భారీగా దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. బుధవారం, స్థానిక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి …

Read More »