Recent Posts

ఏపీలో భవన నిర్మాణాలకు కొత్త విధానం.. వివరాలివే

ఏపీలో కొత్తగా భవనాలు కట్టాలనుకునేవారికి ముఖ్య గమనిక. పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వం నూతన విధానం తీసుకురానుంది. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తేనున్నట్లు చెప్పారు. నూతన విధానం ప్రకారం ఇక ముందు ఇంజనీర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల ప్లాన్ ప్రకారమే ఇల్లు, భవనాలు నిర్మించాల్సి ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో నారాయణ సమీక్ష జరిపారు. …

Read More »

విదేశంలో మెట్రో రైళ్లు నడపనున్న హైదరాబాద్ మహిళా లోకో పైలట్ ఇందిర.. హ్యాట్సాఫ్

హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఇందిరా ఈగలపాటి.. సౌది అరేబియా రాజధాని రియాద్‌లో సత్తా చాటనున్నారు. రియాద్‌లో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో రైళ్లను నడపనున్నారు. రియాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను 2025 జనవరిలో ప్రారంభించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో రైలు వ్యవస్థల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం చెబుతోంది. లోకో పైలట్ ఇందిరా ఈగలపాటి.. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పనిచేశారు. మెట్రో రైళ్లను నడపడం, స్టేషన్ల …

Read More »

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా కేబినెట్ ర్యాంక్‌తో కీలక పదవి దక్కింది. ఆయన్ను విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.. రెండేళ్ల పాటు ఈ పదవిలొ కొనసాగుతారు. అయితే చాగంటి ఈ పదవిని తీసుకుంటారా లేదా అనే చర్చ జరిగింది. ఎందుకంటే 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరోసారి పదవులు ఇచ్చినా ఆయన తిరస్కరించారు. తనకు ఈ పదవి దక్కడంపై చాగంటి …

Read More »