Recent Posts

తీవ్ర జనాభా సంక్షోభంలో చైనా.. వేలాది స్కూల్స్ మూసివేత

ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం అమలు చేసిన కఠిన నిబంధనలు ఇప్పుడు చైనా పాలిట శాపంగా మారాయి. ఎన్నడూ లేని తీవ్ర జనాభా సంక్షోభాన్ని డ్రాగన్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం విద్యతోపాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గడంతో చైనా వ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజాగా ఓ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా 2023లో 14,808 కిండర్‌ గార్టెన్లు (Kindergartens) మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో …

Read More »

అన్న క్యాంటీన్ల కోసం పెద్ద మనసుతో.. వారికి బంపరాఫర్, ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్న క్యాంటీన్లకు ఇచ్చే విరాళాలకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్‌ సామాజిక బాధ్యత) కింద వివిధ సంస్థల నుంచి కూడా విరాళాలు సేకరించబోతున్నారు. దీని కోసం అన్న క్యాంటీన్‌ పేరుతో ఛారిటబుల్‌ ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదాయపన్ను, కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల విభాగాల నుంచి అనుమతులు కూడా వచ్చాయి. వచ్చే నెల నుంచి అన్నా క్యాంటీన్ పేరుతో ఛారిటబుల్ ట్రస్టు ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా …

Read More »

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే.. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు తీపికబురు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్ ఉన్న జీతాలను చెల్లించాలని నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ సూచనలతో.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ కృష్ణతేజను ఆదేశించడంతో ఉద్యోగులకు పెండింగ్‌ జీతాలు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా పీఆర్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందితో పాటు ఈఎన్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఇన్స్యూరెన్స్‌ …

Read More »