Recent Posts

కష్టకాలంలో షేక్ హసీనాకు సాయం.. కేంద్రంపై శశిథరూర్ ప్రశంసలు

కష్ట సమయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. ఓ స్నేహితుడిగా ఆమెకు భారత్ సహయం చేయడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి..బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై జాతీయ మీడియాతో తిరువనంతపురం ఎంపీ మాట్లాడుతూ.. పొరుగు దేశంలో అధికార మార్పిడి విషయంలో భారత్ ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం …

Read More »

చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం …

Read More »

మార్కెట్లు పడుతున్నా అదరగొడుతున్న ఓలా.. మళ్లీ ఒక్కరోజే 20 శాతం పెరిగిన షేరు.. కాసుల పంట!

Stock Market Live Updates: సెబీ ఛైర్‌పర్సన్ మాధబి బచ్, ఆమె భర్తపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన షేర్ల విలువల్ని కృత్రిమంగా పెంచేందుకు దోహదపడిన అంతర్జాతీయ ఫండ్లలో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌పర్సన్ దంపతులకు వాటాలున్నాయని ఈ సంస్థ ఆరోపించింది. వీటిని ఇరువురూ ఖండించారు. ఆరోపణలు అర్థరహితమని కొట్టిపారేశారు. అయినప్పటికీ హిండెన్‌బర్గ్ ఆరోపణల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. సూచీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సోమవారం సెషన్ …

Read More »