Recent Posts

నా నెంబర్ 2 కాదు.. 3 కాదు.. టీవీ9 కాంక్లేవ్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

రేవంత్ రెడ్డి కేబినెట్‌లో నేను నెంబర్ 2 కాదు.. 3 కాదు.. నా నెంబర్ 11 అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.. గతంలో మంచిశాఖ దక్కిందని మాత్రమే చెప్పానంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది విజయోత్సవంపై టీవీ9 వేదికగా జరిగిన వాట్ తెలంగాణ థింక్స్ టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డీకే శివకుమార్‌ అంత సీనియర్‌ కాదంటూ పొంగులేటి పేర్కొన్నారు.. శక్తివంచన లేకుండా ప్రజలకు అండగా ఉంటానంటూ వివరించారు.. ఏడాది పాలనపై మాట్లాడుతూ.. …

Read More »

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. వారిని పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాాదం జరిగింది.అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేపట్టింది.  అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి …

Read More »

సీబీఐ కేసులో అరెస్ట్ చేస్తామంటూ వీడియో కాల్.. కట్‌చేస్తే ఖాతాలోంచి రూ.15 లక్షలు ఉష్ కాకి

ఆ వెంటనే వీడియో కాల్ లోకి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియో కాల్ లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కనిపించాడు.సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నాము..మీ దగ్గర హవాలా డబ్బు ఉంది హవాలా వ్యాపారం చేస్తున్నారు..సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించారు..ఖమ్మం జిల్లా వైరాలో ఓ రిటైర్డు ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన బ్యాంకు ఖాతా నుంచి …

Read More »