Recent Posts

తమిళనాడులో వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్.. హత్య కేసులో నిందితుడిగా, వీడియో వైరల్!

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని మధురైలో శ్రీకాంత్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు స్థానిక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొస్తున్నారు. శ్రీకాంత్‌ని కారులో ఎక్కిస్తున్న సమయంలో మాట్లాడారు. తాను డాక్టర్‌నని.. ప్రాణాలు పోయడమే తప్ప ప్రాణాలు తీయడం చేతకాదంటూ కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ …

Read More »

ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10లక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ పథకాన్ని అమలు చేసే అంశాలపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేయాలా.. సెర్ప్‌ (పేదరిక నిర్మూలన సొసైటీ) ద్వారా అమలు చేయాలా అనే అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు రెండు విధానాలు ప్రభుత్వం దగ్గరకు వచ్చాయి. సెర్ప్ ద్వారా విధానం అమలు చేయాలా?.. గ్రామ, వార్డు సచివాయాల ద్వారా అమలు చేయాలా అనే రెండు ఆప్షన్లను పరిగణలోకి తీసుకుంది. 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం.. …

Read More »

కానిస్టేబుళ్లకు రూ.కోటి, ఐపీఎస్‌లకు రూ.2 కోట్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

త్యాగానికి, సేవకు పోలీసులు ప్రతీక అని.. వారు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు సమాజానికి తోడ్పాటు అందించడంలో ముందుంటారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో వారి సేవలు మరువలేనివని కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు విడిచిన పోలీసు అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. గోషామహల్ పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. పోలీసుల త్యాగాలు …

Read More »