Recent Posts

డిప్యూటీ సీఎం గారి విజ్ఞప్తి.. ఇక నుంచి వారంలో ఒక్కరోజైనా ఆ పని చేయండి

AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి వారంలో ఒక్క రోజైనా ప్రజలు.. చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఉపముఖ్యమంత్రి.. ప్రజలకు ఈ సూచన చేశారు. ఈ క్రమంలోనే చేనేత కార్మికులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు. నెలకు ఒకసారైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని హితవు పలికారు. జాతీయ చేనేత …

Read More »

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50వేలు, ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారందరికి శుభవార్త చెప్పారు. చేనేత కార్మికులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని.. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ వైఎస్సార్‌సీపీ సర్కారు రద్దు చేసింది అన్నారు. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. చేనేత కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామని.. వెనుకబడిన వర్గాలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా …

Read More »

 ‘మీకల, నా ధైర్యం రెండూ ఓడిపోయాయి.. ఇక గుడ్‌బై!’ వినేశ్‌ ఫొగాట్‌ సంచలన నిర్ణయం

ప్యారీస్‌ ఒలంపిక్స్‌ 2024లో కేవలం 100 గ్రాముల అదనపు బరువు వల్ల రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆమెకు ధైర్యం చెబుతూ ఎందరో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. వినేశ్‌ ట్వీట్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read More »