Recent Posts

ఏపీలో మరో రెండు పథకాల అమలుకు మహూర్తం ఫిక్స్.. ఒక్కో విద్యార్థికి . 15వేలు, ఒక్కో రైతుకు రూ.20వేలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలపై ఫోకస్ పెట్టింది. దీపావళి నుంచి మహిళలకు మూడు ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు పథకాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆ రెండు పథకాలు ఎప్పటి నుంచి అమలు చేయాలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోంది. తల్లికి వందనం పథకాన్ని మరో మూడు నెలల్లో అమలు చేయబోతున్నట్లు సమాచారం. అలాగే రైతులకు సంబంధించిన ‘అన్నదాతా సుఖీభవ’ …

Read More »

గుంటూరు: రైలు పట్టాలపై ప్రేమజంట.. భయంతో వణికిపోయిన స్థానికులు

గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రపింది. పెదకాకాని సమీపంలో యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మహేష్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్ డిప్లొమా వరకు చదివి.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్‌ స్టోర్‌లో ఉద్యోగం చేశాడు. అక్కడే శైలజతో పరిచయం ఏర్పడగా.. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేష్, శైలజల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. యువకుడి తల్లిదండ్రులు …

Read More »

AP: ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్.. పూజారి పనే

ఆంధ్రప్రదేశ్‌లో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేసిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దారుణం వెనుక పూజారి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజారి హరినాథ్ మరో ఐదుగురితో కలిసి పేలుడు పదార్థాలతో గుడిని పేల్చివేసేందుకు కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సోమవారం (అక్టోబర్ 14) రాత్రి ధ్వంసం చేశారు. పేలుడు పదార్థాలతో ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వర్షం కురవడంతో పేలుడు పదార్థాలు సరిగా …

Read More »