Recent Posts

బతుకమ్మకు అమెరికాలో అధికారిక గుర్తింపు.. ‘తెలంగాణ హెరిటేజ్ వీక్‌’ పేరుతో సంబురాలు

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సూచిక.. తెలంగాణకు మాత్రమే సొంతమైన పూల కేళిక.. బతుకమ్మ పండుగ. పూలను పూజించే అత్యంత అరుదైన సంబురం బతుకమ్మ. ప్రకృతిలోనే పరమాత్మున్ని చూసుకుని.. పూలనే గౌరమ్మగా భావించి.. చేసుకునే తొమ్మిదిరోజుల మహా ఉత్సవం బతుకమ్మ. అలాంటి బతుకమ్మ పండుగకు అరుదైన గుర్తింపు లభించింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమార్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు.. బతుకమ్మ పండుగకు అధికారికంగా గుర్తించాయి. అంతేకాదు.. బతుకమ్మ సంబరాల వారాన్ని.. బతుకమ్మ …

Read More »

బెజవాడ దుర్గమ్మకు మంగళసూత్రం చేయించిన సామాన్య భక్తుడు.. రూపాయి, రూపాయి కూడబెట్టి

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఓ సామాన్య భక్తుడు భారీ కానుకను సమర్పించాడు. కొబ్బరి బోండాల వ్యాపారం చేసే అతడు కొన్నేళ్లుగా రూపాయి రూపాయి కూడబెడుతూ.. పోగు చేసిన సొమ్ముతో 203 గ్రాముల బంగారం కొని అమ్మవారికి మంగళసూత్రం తయారుచేయించి తీసుకొచ్చాడు. ఆ హారం విలువ రూ. 16.50 లక్షల విలువ ఉంటుందని ఆలయ సిబ్బంది తెలిపారు. అమ్మవారి భక్తుడైన అంకులయ్యా.. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేల తన కానుకను సమర్పించి మురిసిపోయాడు. తన కుటుంబంతో కలిసి శనివారం (అక్టోబర్ 5) దుర్గగుడికి వచ్చి మంగళసూత్రాలను …

Read More »

సీఎం రేవంత్ రెడ్డి, కొండా సురేఖపై పరువు నష్టం దావా.. కేటీఆర్ సంచలన నిర్ణయం

KTR on Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు రసవత్తవరంగా మారాయి. హైడ్రా కూల్చివేతలతో పాటు ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. ఈ గొడలన్నింటి మధ్య రైతుల రుణమాఫీ అంశం మరుగున పడిపోతుండటంతో.. ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపడుతోంది. ఇటు మూసీ, హైడ్రా బాధితులకు అండగా ఉండటంతో పాటుగానే.. అటు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఈరోజు (అక్టోబర్ 05న) రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రైతు ధర్నా …

Read More »