Recent Posts

క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్.. కవితపై చర్యలకు సిద్ధమవుతోందా?

బీఆర్ఎస్‌లో తీవ్రమైన కుదుపులు. ఓ వైపు కాళేశ్వరంపై విచారణ పేరుతో బయటి నుంచి ఒత్తిడి పెంచే పరిణామాలు. మరోవైపు పార్టీలో కవిత నుంచి ఎదురవుతున్న ధిక్కార స్వరాలు. ఇంతకాలం కేసీఆర్‌కు కుటుంబమే బలం అనుకున్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు ఆ కుటుంబమే బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్న పరిస్థితి. కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్‌రావు. వీరంతా కేసీఆర్ కుటుంబసభ్యులు. కారు లాంటి బీఆర్ఎస్ పార్టీకి నాలుగు చక్రాల్లాంటివారు. తెలంగాణ ఉద్యమంలో, ఆ తరువాత అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీలో ఎలాంటి కుదుపులు లేకుండా చూసేందుకు ఎవరి …

Read More »

 తెలంగాణలో సీబీఐకి రీ ఎంట్రీ.. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఇప్పుడేం జరగనుంది..?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ముమ్మాటికి అవినీతి జరిగింది..! పీసీ ఘోష్‌ కమిషన్‌ కూడా అదే తేల్చింది..! కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిందేనంటూ సీబీఐకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.. ఇటు సీబీఐ విచారణకు కాషాయపార్టీ కూడా పచ్చజెండా ఊపింది. కాళేశ్వరం అవినీతికి పూర్తి బాధ్యత కారుపార్టీదేనని హస్తం నేతలతో కలసి కమలంపెద్దలు గట్టిగానే వాదిస్తున్నారు. ఇక అదంతా అటుంచితే… సీబీఐ ఎంట్రీపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోకి నో ఎంట్రీ ఉన్న సీబీఐ ఎలా వస్తుంది..? వస్తే ఇంపాక్ట్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. …

Read More »

కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయకూడదుః హైకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం కమిషన్‌ నివేదికను సవాల్‌ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కమిషన్‌ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్‌ 7కు వాయిదా వేసిన వేసింది హైకోర్టు. — హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ …

Read More »