Recent Posts

టెన్త్‌ విద్యార్ధులకు అత్యధిక మార్కులు వచ్చేలా.. వంద రోజుల ప్రణాళిక అమలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్ధులకు మార్చి నెలలో జరగనున్న పబ్లిక్ పరీక్షల కోసం సర్కార్ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. పరీక్షల్లో విద్యార్ధులు అత్యుత్తమ మార్కులు సాధించేలా అదనపు తరగతులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు..ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి …

Read More »

ఏపీలో కొత్త సంవత్సరంతో పాటే మారనున్న డీజీపీ, సీఎస్‌.. మరి ఈ లిస్ట్‌లో ఉన్నది ఎవరు..?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు డిసెంబర్ నెలాఖరుతో రిటైర్ కాబోతున్నారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే సీనియర్ల లిస్టును పరిశీలించిన ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబు పాతవారికే మరో అవకాశమిస్తారా? లేక ఎవరైనా కొత్తవారిని తీసుకొస్తారా? అనే ఆసక్తి నెలకుంది.ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సంవత్సరంతో పాటే.. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కూడా రానున్నారు. ప్రస్తుత సీఎస్‌ …

Read More »

కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట.. 10 రోజుల వరకు అరెస్ట్‌ చేయొద్దన్న హైకోర్టు

ఫార్ములా -E కేసుపై ACB అడుగులు వేస్తున్నవేళ, కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్‌ పిటిషన్‌కు అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్‌ చెప్పడంతో, లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2.15కి లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి.హైకోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట ‌లభించింది. 10 రోజుల వరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అలగే డిసెంబర్ 30లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను …

Read More »