Recent Posts

వారి అకౌంట్లలో మాత్రమే ‘రైతు భరోసా’ డబ్బులు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

వర్షాకాలం రావటంతో.. రైతులంతా ప్రభుత్వంవైపు ఆశగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నగదు సాయం ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 13న) జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లో మాట్లాడిన మంత్రి తుమ్మల.. రైతు భరోసా డబ్బులు విడుదలపై కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా డబ్బులు.. ఈసారి పంట వేసి సాగు చేస్తున్న వారికే ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు. కొండలు, గుట్టలకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వబోమని క్లారిటీ …

Read More »

అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్‌లలోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తానికి రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ చెల్లించబోతోంది. అమరావతి రైతులకు కౌలు నిమిత్తం ప్రభుత్వం ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. ఆ నిధుల్ని సీఆర్డీఏకు విడుదల చేస్తూ పాలనాపరమైన అనుమతులు కూడా జారీ చేశారు. అంతేకాదు అమరావతిలో ప్రస్తుత హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది. మరోవైపు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ …

Read More »

ఏపీలోని ఆ స్టేషన్‌లో కూడా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలుకు స్టాప్!

ఏపీలోని మరో రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఆగనుంది. ఈ మేరకు వందేభారత్‌ హాల్ట్‌కు రైల్వే సహాయ మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి దుర్గ్-విశాఖపట్నం మధ్య వందేభారత్‌ రైలు పట్టాలెక్కబోతోంది. అయితే పార్వతీపురంలో స్టాప్‌ లేకుండానే రైల్వే అధికారులు ఈ వందేభారత్ రైలు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. అయితే ఈ రైలుకు పార్వతీపురం, టౌన్‌ రైల్వే స్టేషన్‌ల్లో నిలుపలేదు. వెంటనే స్పందించిన పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర విశాఖపట్నంలోని డీఆర్‌ఎంతో పాటుగా అధికారులను …

Read More »