Recent Posts

14 వేల మంది ఆదివాసీ చిన్నారులతో జాతీయ గీతాలాపన.. గిన్నిస్ రికార్డుల్లోకి భారతీయుడి ఆర్కెస్ట్రా

ప్రపంచ ప్రముఖ సంగీత దర్శకుడు, మూడుసార్లు గ్రామీ విజేత రిక్కీ కేజ్‌ (Ricky Kej).. స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని అద్భుతమైన వీడియోను రూపొందించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా సహా సంగీత దిగ్గజాల సహకారంతో భారత జాతీయగీతం జనగణమనను (National Anthem) వైవిధ్యభరితంగా ఆలపించారు. బ్రిటిష్‌ ఆర్కెస్ట్రా, 14వేల మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను రిక్కీ కేజ్‌ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్‌ చేశారు. పండిట్ హరిప్రసాద్‌ …

Read More »

ఢిల్లీకి చంద్రబాబు.. హడావిడిగా వెళ్తున్న ఏపీ సీఎం, రేవంత్ కూడా హస్తినలోనే.. ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటూ ఆయన హస్తినలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళతారు.. 16, 17న అక్కడే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ పలువుర్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు …

Read More »

అన్న క్యాంటీన్లకు ప్రతి ఏటా రూ.కోటి ఇస్తానన్న ప్రముఖ వ్యాపారి.. ఆయనకు రూ.100 కోట్లు ఆదాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో సంపద ఉన్నవారు అట్టడుగున ఉన్న వారికి సాయం చేసి సమానంగా తీసుకు రావాలని చంద్రబాబు సూచించారు. అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలని కోరారు.. వీరి కోసం ప్రత్యేకంగా అకౌంట్ నంబర్ ప్రారంభించారు. ఎస్‌బీఐ ఖాతా నంబరు 37818165097, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0020541కు అందించాలన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు. అన్న క్యాంటీన్ల కోసం …

Read More »