Recent Posts

విమానాశ్రయాల్లో సరికొత్త విధానం.. ఇకపై సెకెన్లలోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి!

విమానాశ్రయాల్లో మరింత వేగంగా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తిచేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ప్రయోగాత్మకం చేపట్టిన ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ప్రోగ్రామ్‌ను దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అమలుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలోని ప్రధాన 20 ఎయిర్‌పోర్టులకు దీనిని విస్తరిస్తున్నట్టు పేర్కొంది. ఈ విధానం వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సెకెన్ల నుంచి గరిష్టంగా 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని తెలిపింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జూన్ 22న ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్‌ (FTI-TTP)ను కేంద్ర …

Read More »

విశాఖవాసులకు టీటీడీ అద్భుత అవకాశం.. ప్రతిరోజూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం, ఎక్కడంటే!

విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి రోజు లడ్డూలు విక్రయించనున్నారు. గతంలో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిగేవని.. భక్తుల కోరిక మేరకు గురువారం నుంచి ఇవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారి …

Read More »

కదిరి: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్.. ఏమైందంటే

శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ బాలుడి దవడలో బ్రష్ గుచ్చుకుంది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని సైదాపురంలో 11 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే బాలుడు ఉదయాన్నే లేచి పళ్ళు తోముతున్నాడు.. ఆ సమయంలో బాలుడు కిందపడటంతో బ్రష్‌లోని పదునైన భాగం దవడలోకి చొచ్చుకుపోయింది. బ్రష్ దవడలో అలాగే ఇరుక్కుపోగా.. వెంటనే తల్లిదండ్రుల్ని బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాలుడికి ఆపరేషన్ చేసి బ్రష్‌ను తొలగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.. బాలుడికి ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

Read More »