Tag Archives: andhra pradesh

AP Gas Cylinders: భీమవరంలో 35 గ్యాస్ సిలిండర్లు సీజ్.. ఆ పొరపాటు చేస్తే సిలిండర్లు పోయినట్టే..!

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీపావళి నుంచే దీపం 2.0 పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి దీనికి అనూహ్య స్పందన వస్తోంది. నియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం నమోదు చేసుకోవటంతో పాటుగా.. సిలిండర్ బుక్ చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనం పొందుతున్నారు. అయితే కొన్ని చిన్న, చిన్న పొరబాట్ల కారణంగా ఉచిత గ్యాస్ …

Read More »

విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. బీచ్ రోడ్‌లో 24 అంతస్థుల భారీ స్కై స్క్రాపర్

విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్ కూడా అనే సంగతి తెలిసిందే. విశాఖ బీచ్, అరకు అందాలను చూడటానికి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వైజాగ్ వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి విశాఖ వస్తోన్న పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అనేక సదస్సులకు కూడా నగరం వేదికగా మారుతోంది. దీంతో విశాఖ నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరంలోని ఐకానిక్ తాజ్ గేట్ వే హోటల్‌ను కూల్చివేసి దాని స్థానంలో ఫైవ్ స్టార్ …

Read More »

ఏపీలోని ఆ ఆలయంలో ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదు.. టీటీడీ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో రాములోరు కొలువైన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇకపై ఒంటిమిట్ట రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని.. పెళ్లిలు జరగనీయకుండా ఆపేయాలని భారత పురాతత్త్వ-సర్వేక్షణశాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు టీటీడీ శుపరిపాలన యంత్రాంగానికి మొబైల్‌లో కాల్ చేసి ఆదేశించారు. పెళ్లిళ్లకు అనుమతులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భక్తులు అవాక్కయ్యారు. ఈ నిర్ణయం సరికాదని.. వెంటనే వెనక్కు తీసుకోవాలంటున్నారు. ఇది వాస్తవమేనని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌. ఒంటిమిట్ట కోదండ …

Read More »

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. డిసెంబర్‌లో పక్కా, రెడీగా ఉండండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనుంది. ఈ నెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా.. 184 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేస్తారు. సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావించినా.. వరదల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. పాఠశాల, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, విశ్వవిద్యాలయాలు, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ అద్యాపకులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయనున్నారు. విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. మరోవైపు నారా లోకేష్ …

Read More »

ఏపీలో రైతులకు శుభవార్త.. రూ.19,000 ఫిక్స్, కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పామాయిల్ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ప్రధానంగా ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణపై చర్చించారు. పామాయిల్‌ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పామాయిల్ రైతులకు ఊరట లభించింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే టన్ను ధర రూ.12,500 నుంచి ఏకంగా రూ.19,000కి ధర పెరిగింది …

Read More »

ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. పెద్ద కష్టమే వచ్చింది

ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి అప్పగించారు. ఆ వెంటనే అమ్మకాలు మొదలయ్యాయి..రూ.99కే క్వార్టర్‌ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ కొత్త మద్యం విధానం అమల్లో ఉంటుంది. అయితే మందుబాబులకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్రంగా కొరత ఉందని చెబుతున్నారు. వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా ఆయా బ్రాండ్ల మద్యం తగినంత …

Read More »

కేంద్రమంత్రులైనా ఎంపీలని మర్చిపోకండి.. తప్పించుకోవద్దు: చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్ కో పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శ్రీకాకుళం, కృష్ణా, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ …

Read More »

ఏపీలో వారికి అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షల నుంచి రూ.3లక్షలు, మంచి ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో కార్పొరేషన్‌ ద్వారా అమలు చేసిన పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఈ పథకాల్లో తొలి పథకంగా.. జీవనోపాధి కల్పనకు రూ.50 వేల రాయితీతో రుణాల మంజూరుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్‌ని అనుసంధానించి సెర్ప్‌ ద్వారా అమలుకు శ్రీకారం చుట్టింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,732 మంది ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

ఏపీలో స్కూల్ విద్యార్థులకు బంపరాఫర్.. ఉచితంగా కిట్లు, డబ్బులు కూడా ఇస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేయగా.. ఈ పథకం కింద కిట్లు అందించేందుకు రూ. 953.71 కోట్ల వ్యయంకానుంది. ఈ నిధుల్లో కేంద్రం రూ. 175.03 కోట్లు.. రాష్ట్రం రూ. 778.68 కోట్లు కేటాయించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే …

Read More »

నా బిడ్డలు కన్నీళ్లు పెట్టుకున్నారు, తట్టుకోలేకపోయాం.. ఏపీ కేబినెట్‌లో సీఎం, మంత్రుల మధ్య చర్చ

ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో వాడీవేడి చర్చ జరిగింది.. కూటమి ప్రభుత్వంలో ముఖ్య నేతలు, వారి ఇళ్లలో మహిళలపై కొందరు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న తీరు ప్రస్తావను వచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్ కొందరు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొంతమంది పోలీసుల …

Read More »